‎Shanthi Krishna: వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను హీరోయిన్ నే.. ప్రేక్షకులు ఆదరిస్తారు.. నటి కామెంట్స్ వైరల్!

‎Shanthi Krishna: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఒక్కసారి అవకాశాలు రావడం తగ్గాయి అంటే అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంకా హీరోయిన్లకు పెళ్లి అయిన తర్వాత అవకాశాలు రావడం అన్నది చాలా వరకు తక్కువ అని చెప్పాలి. కొంతమంది పెళ్లి అయినా వయసు మీద పడినా కూడా హీరోయిన్గా సినిమాలలో నటిస్తూనే ఉంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత నటీమణులకు హీరోయిన్ గా చాలా తక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. వయసు మీద పడే కొద్ది అవకాశాలు కూడా కరువు అవుతూ ఉంటాయి.

‎ కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే 60 ఏళ్ల నటి మాత్రం ఇప్పుడు తనని సినిమాలో పెట్టి తీసినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు అని గట్టిగా చెబుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయానికి వస్తే.. మలయాళ హీరోయిన్ శాంతి కృష్ణ. ఈమె మలయాళం లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. ఒక్క మలయాళంలో మాత్రమే కాదు, తమిళ భాషలో కూడా అనేక సినిమాలలో నటించింది. తెలుగులో ప్రియురాలు అనే ఏకైక చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే ఇప్పటికీ తనకు హీరోయిన్‌ గానే నటించాలనుంది అని తెలిసింది శాంతి కృష్ణ.

‎తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సందర్భంగా మాట్లాడుతూ.. ఫహద్‌ ఫాజిల్‌, నివిన్‌ పౌలీ వంటి హీరోలకు తల్లిగా నటించాక నన్నెందుకు కథానాయికగా తీసుకోవాలనుకుంటారు? కానీ, ఇప్పటికిప్పుడు నన్ను హీరోయిన్‌ గా పెట్టి సినిమా తీసినా మలయాళ ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆదరిస్తారు. ఇప్పటికీ వారి మనసుల్లో నాకు ప్రత్యేక స్థానం ఉంది అని ఆమె చెప్పకొచ్చింది. కాగా శాంతి కృష్ణకు ప్రస్తుతం 60 ఏళ్లు. కొన్నాళ్లపాటు బెంగళూరులో ఉన్న ఆమె ప్రస్తుతం కొచ్చిలో సెటిల్ అయ్యింది. తాజాగా ఆమె ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి.