భారీ సెట్లో క్రికెటర్ తో డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహం

Shankar creating massive set for his daughter's marriage
Shankar creating massive set for his daughter's marriage
స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనకి తెలుసు. ఆయన సినిమాలో ప్రతిదీ భారీగా, గొప్పగా ఉంటుంది.  ముఖ్యంగా సెట్ వర్క్ కళ్ళు చెదిరేలా ఉంటుంది.  అందుకే ఆయన సినిమా అంటే భారీగా డబ్బు ఖర్చవుతుంటుంది. ఇక సినిమాలనే ఈ స్థాయిలో రూపొందించే శంకర్ తన కుమార్తె వివాహాన్ని ఎంత గొప్పగా చేస్తారో చెప్పనక్కర్లేదు. కుమార్తె పెళ్లి కోసం భారీ సెట్టింగ్ వేయిస్తున్నారట ఆయన. శంకర్ సినిమాలకు పనిచేసే ముత్తురాజ్ శంకర్ కుమార్తె పెళ్లికి పెద్ద సెట్ నిర్మిస్తున్నారట.
 
జూన్ 27న మహాబలిపురంలోని ఒక ఆడిటోరియంలో ఈ వివాహం జరగనుంది. శంకర్ కుమారై ఐశ్వర్య డాక్టర్.  ఆమె వివాహమాడబోయేది ఒక క్రికెటర్ ను కావడం విశేషం. అతనే పుదుచ్చేరి క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్. రోహిత్ తండ్రి దామోదరన్ ఒక బడా పారిశ్రామికవేత్త. తమిళనాడు ప్రీమియర్ లీగ్లోని మధురై పాంథర్స్ టీమ్ ఓనర్  ఆయన.  తమిళనాడులో లాక్ డౌన్ ఎత్తివేస్తుండటంతో ఈ వివాహానికి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.  ఇకపోతే ప్రజెంట్ ‘ఇండియన్-2’ చిత్రాన్ని రీస్టార్ట్ చేసే పనిలో ఉన్న శంకర్ దాని తర్వాత రామ్ చరణ్ సినిమాను మొదలుపెట్టనున్నారు.