Dandruff: ఉల్లి తొక్కల షాంపూతో చుండ్రు సమస్యకు చెక్..!

Hair Care Tips: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం అధికం అవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు.కానీ వాతావరణ కాలుష్యం అధికం అవటం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు చర్మం జుట్టు సంబంధిత సమస్యలు కూడా అధికమయ్యాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యలలో చుండ్రు సమస్య కూడా ఒకటి. ఈ చిన్న సమస్య తలెత్తడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, జుట్టు సరిగా శుభ్రం చేసుకోకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం మొదలైన ఈ కారణాల వల్ల ఈ సమస్య అధికమవుతుంది.

అయితే ఈ చుండ్రు సమస్యను నివారించడానికి చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల షాంపూలు, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. వాటిని ఉపయోగించటం వల్ల ఫలితం దక్కుతుందో లేదో చెప్పలేము. కానీ మన ఇంట్లో ఉండే ఉల్లిపాయల తొక్కలు ఉపయోగించి ఈ చుండ్రు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎందుకు పనికి రావని పారబోసే ఈ ఉల్లి తొక్కలు ఉపయోగించి షాంపూ తయారు చేసుకొని ఉపయోగిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉల్లి తొక్కల షాంపూ తయారు చేసుకొనే విధానం గురించి తెలుసుకుందాం.

ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీరుపోసి బాగా మరిగించాలి.అందులో ఉల్లి తొక్కలు, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ టీ పొడి వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ నీటిని వడపోసి చాల్లారిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే షాంపూ కొంచం వేసి బాగా కలపాలి. వారానికి రెండు సార్లు ఇలా ఉల్లి తొక్కల తో తయారుచేసిన షాంపు ఉపయోగించి తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.