2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీలో ఇప్పుడు అంతర్గత గొడవలు ఎక్కువైతున్నాయి. మొన్ననే రఘురామ కృష్ణారాజు పార్టీకి రెబల్ గా మారి పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు నరసరావుపేట నియోజక వర్గ ఎంపీ, ఆ నియోజక వర్గంలోనిఎమ్మెల్యేలకు మధ్య గొడవలు జరుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మొదటిసారి ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు.
ఆయన అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నారని, కానీ అక్కడి ఎమ్మెల్యేలు ఆయనకు సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. నరసారావుపేట నియోజకవర్గం కిందకు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే.. పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసారావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఉన్నాయి. వీటిలో ఒక్క పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే ఎంపీకి సహకరిస్తున్నారని అంటున్నారు. మిగిలిన వారంతా కూడా ఎవరి దారిలో వారు వెళ్తున్నారని తెలుస్తోంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతోనే ఎంపీకి నేరుగా వివాదాలు నడుస్తున్నాయి. కోటప్పకొండ తిరునాళ్ల సమయంలో ఈ వివాదాలు మరింత పెరిగి..కేసుల వరకు వెళ్లాయి. ఇక చిలకలూరిపేటలో పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్, ఎంపీ లావు ఓ వర్గంగా ఉండడంతో రజనీ మరో వర్గంగా ఉంటున్నారు.
అలాగే ఒక్కప్పుడు కలిసి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కలిసి రావడం లేదు.అభివృద్ధి పనులకు సహకరించడం లేదని, నరసాపురం ఎమ్మెల్యే గోపి రెడ్డి కూడా ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు. అధివృద్ది పనులకు సహకరించడం లేదని వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. నిధుల్ విషయంలో సత్తెన పల్లి ఎమ్మెల్యే రాంబాబుతో కూడా వివాదాలు మొదలయ్యాయి. ఇలా ఎమ్మెల్యేలందరు ఎంపీకి ఎదురుతిరగడంతో జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఒకే పార్టీ నేతలు ఇలా కొట్టుకుంటే వేరే పార్టీ నేతలు దీన్ని అదునుగా తీసుకొని అధికారం చేలాయిస్తారని పార్టీ నేతలకు సలహాలు ఇస్తున్నారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎలాంటి విభేదాలు ఉన్న కూడా వాటిని అధిష్టానం దృష్టికి తీసుకువచ్చి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని జగన్ సూచనలు చెప్తున్నారు.