AP: జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్… వారి సంగతి తేల్చండి… వారి బండారం బయటపెట్టిన అంబంటి!

AP : ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటాయి. నిత్యం ఏదో ఒక విషయంలో ఏపీ రాజకీయాల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కావడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు గురించి వైసిపి నేతలు స్పందిస్తూ ప్రభుత్వ ధోరణిని పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు. సీనియర్ జర్నలిస్టుగా కొనసాగుతున్న శ్రీనివాస్ రావు న్యూ డిబేట్లో పాల్గొన్నప్పుడు ఆ డిబేట్లో పాల్గొన్న అందరిని ప్రశ్నిస్తూ వారి నుంచి సమాధానాలు వారి అభిప్రాయాలను రాబడుతూ ఉంటారు.

ఇక ఈ డిబేట్లో కొంతమంది సానుకూలంగా మాట్లాడగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఇలా వ్యతిరేకంగా మాట్లాడిన అంశం గురించి అమరావతి మహిళలను ఉద్దేశిస్తూ కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో తనని అరెస్టు కూడా చేశారు. ఇలా కొమ్మినేని అరెస్టు కావడంతో పలువురు ఈ అరెస్టును ఖండిస్తున్నారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి అంబంటి రాంబాబు సైతం కొమ్మినేని అరెస్టు గురించి మాట్లాడుతూ పలు విషయాలను బయటపెట్టారు.

ఈ సందర్భంగా అంబంటి రాంబాబు మాట్లాడుతూ… కొమ్మినేని అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచినందుకు శిక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై కక్షగట్టి అరెస్ట్‌లు చేయడం, అప్రజాస్వామిక ధోరణి అని ఆయన విమర్శించారు.కొమ్మినేని అరెస్ట్‌కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం బెయిల్ రాకుండా చేయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీవీ నుంచి ఒత్తిడితో తొలగించి, సాక్షిలో చేరిన కొమ్మినేని తన డిబేట్లలో నిక్కచ్చిగా మాట్లాడినందుకే లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. కేవలం ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ఇలా కక్ష సాధింపు చర్యలు అరెస్టులు చేస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు.కొమ్మినేనిపై పలువురు అనుచితంగా మాట్లాడినా కిరాక్ ఆర్పీ , సీమా రాజాలపై వారిపై చర్యలు లేకపోవడం, మరింత అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. మరి కిరాక్ ఆర్పి సీమ రాజాలపై ఎందుకని చర్యలు తీసుకోలేదంటూ కూడా అంబటి ప్రశ్నించారు.