ఎన్టీఆర్ నిర్మాత హుస్సేన్ సాగర్ లో దూకడం వెనుక ఇంత జరిగిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని ఫ్లాప్ సినిమాలలో నరసింహుడు ఒకటనే సంగతి తెలిసిందే. బి.గోపాల్ డైరెక్షన్ లో సమీరా రెడ్డి, అమీషా పటేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ సమరసింహారెడ్డి, నరసింహుడు సినిమాల నిర్మాత చెంగల వెంకట్రావు హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేయడం వెనుక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చెంగల వెంకట్రావు సమరసింహారెడ్డి సినిమాను నిర్మించడమే ఒక సాహసం అని ఆయన పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారని అలా గెలవడం వల్ల ఆ ఇన్ఫ్లూయెన్స్ ను ఉపయోగించి బాలయ్యతో ఆయన సినిమాను తీశారని భరద్వాజ్ పేర్కొన్నారు. సినిమా సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉన్నా బాలయ్య సక్సెస్ ట్రాక్ లో లేకపోవడంతో సమరసింహారెడ్డి హక్కులు తక్కువ ధరలకే అమ్ముడయ్యాయని భరద్వాజ్ చెప్పుకొచ్చారు.

సమరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన లాభాలు ఆయనకు పూర్తిస్థాయిలో అందలేదని భరద్వాజ్ పేర్కొన్నారు. ఆ తర్వాత చెంగల వెంకట్రావు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్నారని నరసింహుడు సినిమాకు ల్యాబ్ లో డబ్బులు కట్టలేని పరిస్థితి వస్తే ఆ సమయంలో చెంగల వెంకట్రావు పారిపోయారని భరద్వాజ్ చెప్పుకొచ్చారు. అందువల్ల నరసింహుడు చెప్పిన డేట్ కు రిలీజ్ కాలేదని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్, బి.గోపాల్ ఫైనాన్షియర్లకు సెటిల్ చేసి నరసింహుడు సినిమాను రిలీజ్ చేశారని ఈ కారణాల వల్లే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందని ఆయన అన్నారు. సినిమా రిలీజ్ రోజు సాయంత్రం నిర్మాత హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారని ఆ సినిమా వల్ల చెంగల వెంకట్రావుకు భారీగా నష్టం వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు. తర్వాత కాలంలో రాజకీయంగా ఆయన దెబ్బ తిన్నారని భరద్వాజ్ వెల్లడించారు.