Corona Third Wave: సీనియర్ సిటిజెన్స్ కి ఒమిక్రాన్ శాపంగా మారిందా?

Corona Third Wave : కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజులలో కరోనా కేసులు రెండు కోట్ల మార్కును దాటాయి అంటే దీని తీవ్రత ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ రూపంలో భారతదేశాన్ని కుదిపేసిన కరోనా ఇప్పుడు ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో థర్డ్ వేవ్ వచ్చింది. అయితే సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు.

ఒమిక్రాన్ లక్షణాల తీవ్రత మునుపటి వేరియంట్ లతో పోల్చితే లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. థర్డ్ వేవ్ లో మరణాల రేటు తక్కువగా ఉంది. అయితే వృద్ధులు, అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఒమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నివేదిక ప్రకారం థర్డ్ వేవ్ లో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా చనిపోయారు అని తెలిపారు. మూడవ వేవ్ లో కరోనా కారణంగా ముంబై మహానగరంలో జనవరి నెలలో ఇప్పటివరకు 159 మంది చనిపోతే అందులో బాప్ప 134 మంది 60 ఏళ్లకు పై బడిన వారే. 20 మంది 40 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారు. ఐదు మంది 40 సంవత్సరాల లోపు వయస్సు కలవారు. ఈ మృతులలో 86% మంది ఒకటి కంటే ఎక్కువ ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారే. మృతులలో చాలామంది ఇది వరకే ఒక డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు, అస్సలు వాక్సిన్ వేయించుకొని వారే ఉన్నారు.

సెకండ్ వేవ్ సమయంలో ముంబై లో 40 నుండి 60 ఏళ్ళ వారిలో ఏప్రిల్ నెలలో 30 శాతం, మే లో 32.5 శాతం మంది చనిపోయారు. 60 ఏళ్లకు పై పడిన వారు… ఏప్రిల్ లో 65%, మే నెలలో 60 శాతం మంది ఉన్నారు. సెకండ్ వేవ్ లో కన్నా థర్డ్ వేవ్ లో మరణాల సంఖ్య తక్కువ అన్న వ్యక్తిగత శుభ్రత జాగ్రత్త ఎంతో అవసరం.