Health Tips: రక్తంలో ప్లాస్టిక్ నమూనాలలో గుర్తించిన శాస్త్రవేత్తలు.. ప్లాస్టిక్ వాడకం ఇలాగే కొనసాగితే…!

Health Tips: ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ మనందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది. ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. ప్లాస్టిక్ వాడకం ప్రమాదమని తెలిసినా కూడా ప్రజలు ఏమాత్రం లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వస్తువులు వాతావరణంలో కలిసిపోయి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఈ ప్లాస్టిక్ వల్ల రాబోయే కాలంలో పెను ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నెదర్లాండ్ లో శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో 22 మంది రక్త నమూనాలను శాస్త్రవేత్తలు పరిశీలించగా 17 మంది రక్త నమూనాలలో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్ వస్తువుల లో ఉండే మైక్రో ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఆహారపదార్థాలలో కలిసిపోయి శరీరంలో ప్రేగులలోకి చేరుతున్నాయి. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఏకంగా మానవుని రక్త నమూనాలలో గుర్తించటం ఇదే మొదటిసారి నేతలు వెల్లడించారు.

రక్త నమూనాల లో ప్లాస్టిక్ రోజులు మాత్రమే కాకుండా పాలీ ఇథలీన్‌ టెరెప్ట థలేట్‌ రేణువులు, ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లో వాడే పాలీస్టరిన్‌ కణాలు కూడా శాంపిళ్లలో రక్త నమూనాలో కనుగొన్నారు. అంతే కాకుండా ప్లాస్టిక్‌ సంచులకు వాడే పాలీ ఇథలీన్‌ కణాలు 23 శాతం నమూనాల్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందువల్ల ప్లాస్టిక్ వస్తువుల వాడకం పూర్తిగా నిర్మూలించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.