Saroja Devi: ఏంటి నిజమా.. నటి సరోజాదేవి జీవితాంతం అలా గడిపారా.. నిజంగా చాలా గ్రేట్ అంటూ!

Saroja Devi: మామూలుగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు కెరియర్ ఆరంభంలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కష్టాలు, సమస్యలు అవమానాలు ఇలాంటివన్నీ కామన్ అని చెప్పాలి. ఇక ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే రకరకాల గాసిప్స్ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.. ఒక్క నటీమణుల విషయంలోనే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని చాలామంది హీరోల విషయంలో కూడా గతంలో అనేక రకాల గాసిప్స్ రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.

అలా సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క సెలబ్రిటీ ఏదో ఒక సమయంలో రూమర్స్ కానీ గాసిప్స్ కానీ ఎదురుకోక తప్పదు. కొంతమంది వాటిని చూసి చూడనట్టు వదిలేస్తే మరి కొంతమంది మాత్రం ఎప్పటికప్పుడు అలాంటి వార్తలపై స్పందిస్తూ గట్టిగానే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఒక్క గాసిప్ కూడా లేకుండా కెరియర్ మొత్తం గడిచిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఈ ఇయర్ నటి అని చెప్పాలి. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నటిగా తమ కంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు బి సరోజా దేవి.

13 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి కొన్ని వందల సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అలాగే ఒకప్పుడు 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాలలో నటించి చరిత్ర సృష్టించారు. 87 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే ఈ 87 ఏళ్ళ జీవితంలో ఒక్క గాసిప్‌ కూడా లేకుండా కెరీర్‌ మొత్తం గడవడం అన్నది తన అదృష్టమని ఆమె గతంలో తెలిపారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క గాసిప్ లేకుండా జీవితాన్ని గడపడం అన్నది నిజంగా కాస్త ఆశ్చర్య పోవాల్సిన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక సమయంలో చిన్న చిన్న గాసిపులు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటిది ఒక్క గాసిప్ కూడా ఈ నటి విషయంలో రాలేదు అంటే మెచ్చుకోవాల్సిన విషయం అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు..