చిరంజీవి, సందీప్ వంగా.. అస్సలు గెస్ చేయలేదే !

Sandeep Vanga writing story for Chiranjeevi
Sandeep Vanga writing story for Chiranjeevi
 
మెగాస్టార్ చిరంజీవి కథలను ఎంచుకునే పద్ధతిని కొద్దిగా మార్చారు.  కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ మినహా ఆయన ఒప్పుకున్న మిగతా సినిమాలన్నీ రీమేక్ కథలే.  అందుకే ఒక డైరెక్ట్ తెలుగు సినిమా కథను చేయాలని అనుకుంటున్నారట. ఆ ప్రాసెస్లోనే ఆయన ఎవ్వరూ గెస్ చేయని డైరెక్టర్ సందీప్ వంగా కథను వినాలని అనుకుంటున్నారట. మొదటి సినిమా ‘అర్జుజ్ రెడ్డి’తో బోలెడంత ఫేమ్ సంపాదించాడు సందీప్.  ఆ సినిమా తర్వాత మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలతో వర్క్ చేయాలని అనుకున్నాడు సందీప్.  కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. 
 
దీంతో హిందీలోకి వెళ్లి ‘అర్జున్ రెడ్డి’ని రీమేక్ చేసి అక్కడా పెద్ద విజయాన్ని అందుకున్నాడు.  అయినా ఆయనకు ఆశించిన హీరోల నుండి ఆఫర్లు రానేలేదు.  ప్రభాస్ సినిమా ఉందని అంటున్నారు కానీ ఎప్పుడో క్లారిటీ లేదు. ఇలాంటి టైంలోనే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి నుండి పిలుపు వచ్చిందట. ఏకాంగా మెగాస్టార్ నుండే కాల్ రావడంతో సందీప్ ఆయన కోసం మంచి కథను రెడీ చేసే పనిలో పడ్డాడట. సందీప్ చెప్పబోయే కథ గనుక చిరు మెచ్చితే సినిమా ఓకే అయినట్టే.  ఇప్పటికిప్పుడు వీరి ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు కానీ ఒక రెండేళ్ళ తరవాత తప్పకుండా ఉంటుంది.