Samantha Ruth Prabhu : సమంత హాట్ ఫేవరెట్.! ఇదిగో సాక్ష్యం.!

Samantha Ruth Prabhu : పెళ్ళయ్యాక సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయన్న భావన హీరోయిన్ల విషయంలో గతంలో వుండేది. కానీ, ఇప్పుడది మారింది. బహుశా తెలుగు నాట సమంత ఆ మార్పుకి నిలువెత్తు నిదర్శనం అనుకోవాలేమో. విడాకుల తర్వాత సమంత కెరీర్ అటకెక్కిపోతుందని కొందరు అంచనా వేశారు. కానీ, ఇక్కడా ఆ అంచనాలు గల్లంతయ్యాయి.

సమంత చేతిలో ఓ రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు, కొన్ని తమిళ ప్రాజెక్టులు, ఓ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు మాత్రమే కాదు, తెలుగులోనూ ఆమెకు సినిమాలున్నాయి. ఆ మాటకొస్తే కెరీర్‌లోనే అత్యంత బిజీగా సమంత వున్నది ఇప్పుడేనంటూ ఓ చర్చ కూడా జరుగుతోంది.

ఇదిలా వుంటే, సమంత ఓ సినిమా కోసం మూడు నుంచి ఐదు కోట్ల దాకా డిమాండ్ చేస్తోందన్న ఓ గాసిప్ తెరపైకొచ్చింది. పూజా హెగ్దే, రష్మిక మండన్న పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా, వాళ్ళకే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందడంలేదు. ఇద్దరూ హిందీ, తమిళ సినిమాల్ని తెలుగుతోపాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, రెమ్యునరేషన్ విషయమై వస్తున్న గాసిప్స్ పట్ల సమంత ఎప్పుడూ జాగ్రత్తగానే స్పందిస్తుంటుంది. నిర్మాతే రెమ్యునరేషన్ డిసైడ్ చేస్తారనీ, తాము డిమాండ్ చేసినంత ఏ నిర్మాత కూడా ఇవ్వరనీ సమంత చెబుతుంటుంది.

రెమ్యునరేషన్ సంగతెలా వున్నా, టాలీవుడ్ నుంచి సమంత అతి త్వరలో నాలుగైదు కొత్త ప్రాజెక్టుల్ని సైన్ చేసే అవకాశం వుందనీ, సమంత హాట్ ఫేవరెట్ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలనీ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.