విజయవాడ:దేవా కట్టా దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ నిమిత్తం ‘సాయి ధరమ్ తేజ్ ‘ విజయవాడకు వచ్చారు. విజయవాడలోని వాంబే కాలనీలోని ‘అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్’ను ఆయన గురువారం సందర్శించారు. కాగా ఈ వృద్ధాశ్రమానికి మెగా మేనల్లుడు గతంలో ఆరు లక్షలు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. మెగా హీరో వచించారన్న సమాచారంతో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నిర్వాహకులు తేజ్ కి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబెద్కర్ విగ్రహావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ… నా ప్రతి పుట్టినరోజుకి మెగా అభిమానులు రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఏదైనా ఒక సమస్యని తీసుకుని అందరం కలిసి దానికి శాశ్వత పరిష్కారం చూయించాలని గత సంవత్సరం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ టైం లో ట్విట్టర్ లో విజయవాడలోని ఈ ట్రస్ట్ కి ప్రాబ్లెమ్ ఉందని తెలుసుకుని ఇక్కడ ఉన్న లోకల్ అభిమానులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఏదోకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అభిమానులకి , నా స్నేహితులకి ఈ ఆలోచన గురించి చెప్పి తమ వంతు సాయం చెయ్యాలని కోరాను. నా కోరిక మేరకు అందరూ ముందుకు వచ్చారు. మా వంతుగా తగినంత సహాయం చేశామని తెలియజేసారు.
ఈ సేవా కార్యక్రమంలో నాతో కలిసి సహాయం చేసిన ప్రతి ఒక్క మెగా అభిమానికి , నా మిత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను . అదే విధంగా అందరి సహకారంతో మున్ముందు మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతానని పెద్ద మనసు చాటుకున్నారు. ఇక తన సినిమా గురించి మాట్లాడుతూ… ‘‘కరోనా అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా హాళ్ళకు అనుమతి ఇవ్వటం హర్షణీయం. త్వరలో నేను నటించిన సినిమా “సోలో బ్రతుకే సో బెటర్” విడుదల కానుంది. పైరసీని తరిమికొట్టి థియేటర్లలో సినిమాలు చూసి ఆదరించండి’’ అని విజ్ఞప్తి చేశారు.ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని సినిమాని చూడాలని ఆయన కోరారు.