ఐపీఎల్‌ 2022కి ఉగ్రవాద ముప్పు

ఐపీఎల్‌ 2022కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 26న ఐపీఎల్‌ 15వ సీజన్‌ ప్రారంభం కానుంది. అంతలో ఈ వార్త కాస్త ఆందోళన కలిగించింది. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది సీజన్‌ను ముంబై, పూణేల్లోనే నిర్వహించాలని లీగ్‌ నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వాంఖడే, డీవై పాటిల్‌, బ్రబౌర్న్‌ స్టేడియాల్లో లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్‌ 2022కు ఉగ్రదాడి ముప్పు ఉందన్న వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. ఇంటలిజెన్స్‌ ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.