AP: జగన్ అరెస్ట్ విషయంలో రూట్ మార్చిన కూటమి… ఇంకా ఆధారాలు లభించలేదా?

AP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా మద్యం కుంభకోణం గురించి చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ కుంభకోణంలో భాగంగా పలువురిని అరెస్టు చేశారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్టు కావడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇలా మిథున్ రెడ్డి అరెస్ట్ కావడంతో త్వరలోనే మరో పెద్ద తిమింగలం కూడా అరెస్ట్ కాబోతోంది అంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారాలకు తెర లేపారు. నారా లోకేష్ నుంచి మొదలుకొని హోం మంత్రి ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా జగన్ అరెస్ట్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ఇలా జగన్ అరెస్ట్ గురించి ప్రచారాలు వరకే ఉంది కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకుంది లేదు. ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులు ఒక మిథున్ రెడ్డిని తప్ప ఎవరిని అరెస్టు చేయలేదు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వారిని అరెస్టు చేశారు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయిరెడ్డి వంటి వారి పేర్లను చార్జ్ షీట్ లో చేర్చారే తప్ప చర్యలు తీసుకోలేదు.జగన్ పేరును ఛార్జిషీట్ లో నామమాత్రంగా ప్రస్తావించడం, నిందితుడిగా ఇప్పటివరకూ చేర్చకపోవడం, అయినా నేరుగా అరెస్ట్ అంటూ ప్రచారాన్ని తెరపైకి తీసుకురావడాన్ని చూస్తుంటే ఇదంతా కేవలం మైండ్ గేమ్ అని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఇదే విషయం కూటమికి కూడా కాస్త చికాకుగా మారిపోయింది. ఇటీవల కాలంలో జగన్ అరెస్టు గురించి హోం మంత్రి మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సమాధానం చెప్పారే తప్ప అరెస్టు గురించి క్లారిటీ ఇవ్వలేదు అలాగే నారా లోకేష్ సైతం పక్క ఆధారాలు దొరికిన తర్వాతనే జగన్ అరెస్ట్ ఉంటుందని చెప్పారు అంటే వీరి మాటలను బట్టి చూస్తుంటే సిట్ అధికారులకు కూడా ఇంకా ఆధారాలు దొరకలేదని స్పష్టమవుతుంది. సిట్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ అరెస్టు ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది.