ఓటిటి : “RRR” సినిమా సర్ప్రైజింగ్ స్ట్రీమింగ్.. మూడో యాప్ లో.!

RRR

ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల మార్క్ ను అందుకున్న ఫస్ట్ సినిమాగా అందులోని అరుదైన రికార్డు అందుకున్న చిత్రంగా మన తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్(RRR) సెన్సేషన్ ని రేపిన సంగతి తెలిసిందే.

ఇక థియేటర్స్ లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ఈ చిత్రం నెక్స్ట్ ఓటిటి నెట్ ఫ్లిక్స్ మరియు జీ 5 లో రిలీజ్ అయ్యాక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎనలేని క్రేజ్ ని రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఓటిటి లో ఇలా అదరగొడుతున్న ఈ చిత్రం మరో స్ట్రీమింగ్ యాప్ అంటే మూడో స్ట్రీమింగ్ యాప్ లో కూడా కనిపించి సర్ప్రైజ్ గా మారింది.

మొదట నెట్ ఫ్లిక్స్, జీ 5 తో ఒప్పందం కుదుర్చుకున్న మేకర్స్ ఇప్పుడు హాట్ స్టార్ లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్ కి ఇచ్చారు. అయితే ఇది కూడా మళ్ళీ హిందీ మినహా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

మొత్తానికి అయితే ఈ భారీ సినిమా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సెన్సేషనల్ వర్క్ అందించగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే అజయ్ దేవగన్, శ్రీయ ఇతర స్టార్ లు కీలక పాత్రల్లో నటించగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.