RRR Double Attack : రెండో ముచ్చట: ‘ఆర్ఆర్ఆర్’ తీరుపై అసహనం పెరుగుతోందా.?

RRR Double Attack :  ఓ సినిమాకి ఒక రిలీజ్ డేట్ ఫైనల్ చేస్తేనే, ఆ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలో విడుదలవుతుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటిది, ఏకంగా రెండు డేట్లు.. ఒకటి కుదరకపోతే, ఇంకోటి.. అని ప్రకటిస్తే పరిస్థితి ఎలా వుంటుంది.?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయమై కొత్తగా రెండు రిలీజ్ డేట్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది కూడా. ‘కరోనా పరిస్థితులు అనుకూలిస్తే..’ అంటూ కండిషన్స్ అప్లయ్ విషయాన్ని కూడా పేర్కొన్నారు.

ఇదెక్కడి వింత.? అని చాలామంది ముక్కున వేలేసుకున్నారు. నిజమే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోవిడ్ కారణంగా చాలా ఇబ్బంది పడింది. చివరి నిమిషంలో విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది కూడా. అయితే, ఆ సినిమా చాలా ఇతర సినిమాల్ని ఇబ్బంది పెట్టింది. అలాంటివాటిల్లో ఓ బాధిత సినిమా ‘భీమ్లానాయక్’.

‘సర్కారు వారి పాట’ కూడా ‘ఆర్ఆర్ఆర్’ కారణంగానే వెనక్కి వెళ్ళింది. ఇప్పుడేమో, ‘ఆర్ఆర్ఆర్’ రెండు డేట్లతో ముందుకొచ్చింది. మరి, వేరే సినిమాల పరిస్థితేంటి.? ఇంత బాధ్యతారాహిత్యమా.? అన్న ప్రశ్న ఆయా హీరోల సినిమాల మద్దతుదారులు తమ గళం విప్పుతున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ గొడవ లేకపోయుంటే, సంక్రాంతికి ‘భీమ్లానాయక్’ సినిమా వచ్చేసేదే. ‘భీమ్లానాయక్’ కేవలం ‘ఆర్ఆర్ఆర్’ వల్లనే నష్టపోయింది. ‘రాధేశ్యామ్’ వల్ల కూడా నష్టం జరిగిందనుకోండి.. అది వేరే సంగతి. ‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే ‘రాధేశ్యామ్’ కూడా రెండు డేట్లతో ముందుకొస్తే ఏంటి పరిస్థితి.? పరిశ్రమ పెద్దలెవరూ ఈ అంశంపై ఎందుకు పెదవి విప్పడంలేదో ఏమో.!