వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా మాటల దూకుడు గురించి తెలిసిందే. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడంటే అంటే ఒంటికాలుపై లేచిపడే నేతగా రోజాకి మంచి పేరుంది. చంద్రబాబును విమర్శించాలంటే మహిళా నేతల్లో రోజా మాత్రమే రంగంలోకి దిగాలి. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్లు వేయడంలో పక్కా ప్రొపెషనల్ గా రోజాకి మంచి పేరుంది. తాజాగా కరోనా వైరస్ రోగులు ఏపీలో నూ ఎక్కువ అవ్వడంతో రోజా అసహనాన్ని వెళ్లగక్కారు. పక్క రాష్ర్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఏపీలో కరోనా పెరగడానికి కారణంగా పక్క రాష్ర్టాల ప్రభుత్వాలేనని మండిపడ్డారు. అక్కడ సరైన పరీక్షలు చేయకుండా ఏపీకి పంపిస్తున్నార న్నారు.
కరోనా పాజిటివ్ వచ్చినా అధికారులు, మంత్రులు పట్టించుకోకుండా ఏపీ మీదకి కావాలని వదులుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో కొత్త వారు కనిపిస్తే అడ్డుకోవాలని, వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఏపీలో కరోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఎస్కేప్ అయ్యారు. అసలు విషయం వదిలేసి పోరుగు రాష్ర్టాలపై పడటం సమంజసమా ! అని పాత్రికేయుల్లో చర్చకు దారి తీసింది. రోజా వ్యాఖ్యలు పూర్తి వివాదాస్పదంగా ఉన్నాయని సోషల్ మీడియా లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రజా ప్రతినితిగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా..సమాధానాలు దాట వేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు.
ఇక ఏపీలోకి అధికంగా తెలంగాణ రాష్ర్టం నుంచే తరలి వస్తున్నారు. ఇప్పటికే అక్కడ కరోనా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. అక్కడి ప్రభుత్వం పరీక్షలు చేయలేక చెతులెత్తేసి..ప్రయివేటు ఆసుపత్రులకి అనుమతిచ్చింది. ఇక ఈ జబ్బుకు ప్రయివేటు లో వైద్యం అంటే దోచేయడం ఖాయం. జాతీయ విపత్తుగా ప్రకటించిన జబ్బుకు పూర్తిగా ప్రభుత్వమే వైద్యం చేయించి పంపిచాలి. కానీ ప్రభుత్వాలే చేతులెత్తేస్తున్నాయి. మరి రోజా వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తారేమో చూడాలి.