Roja: ముసలమ్మ నొక్కె బటన్ మీరెందుకు నొక్కలేకపోతున్నారు…. చంద్రబాబును ప్రశ్నించిన రోజా?

Roja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తూ బటన్ నొక్కుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా తమ ఖాతాలలోకి సంక్షేమ పథకాలను అందిస్తూ డబ్బులను జమ చేశారు. ఇలా జగన్మహన్ రెడ్డి బటన్ నొక్కడంపై చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు.

జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందించడంతో చంద్రబాబు స్పందిస్తూ బటన్ నొక్కడం ఎవరివల్ల అయిన అవుతుంది మూలన మంచం పై ఉన్నటువంటి ముసలమ్మ కూడా బటన్ ఈజీగా నొక్కగలదు అందులో గొప్పేముంది అంటూ మాట్లాడారు. అయితే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ముసలమ్మ నొక్కే బటన్ కూడా నొక్కడం చేతకాలేక పోయింది అని నిరూపించుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా ఆయన అధికారంలోకి వచ్చారు అయితే దీనిని అలసగా తీసుకున్నటువంటి కూటమి పార్టీలు జగన్ ఇచ్చే దానికంటే రెండింతలు ఎక్కువగా ఇస్తాము అంటూ ప్రజలను నమ్మించారు. ఇలా చంద్రబాబు ఒకటికి రెండు సార్లు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తారని ఆశించిన ప్రజలు కూడా ఆయనకు ఓట్లు వేసే పట్టం కట్టారు.

ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వాలని నాకి ఉంది కానీ డబ్బులు లేవంటూ ఈయన మాట మార్చేశారు. ఈ విషయంపై రోజా స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాట మార్చేసారని రోజా ఫైర్ అయ్యారు.

మూలన కూర్చున్న ముసలమ్మ కూడా వైయస్ జగన్ మాదిరిగా బటన్ నొక్కగలదు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ముసలమ్మ నొక్కె బటన్ మీరు నొక్కలేకపోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఎక్కడ అని నిలదీశారు. అధికారం రాగానే సూపర్ సిక్స్ పథకాలను మరిచిపోయారని సంపద సృష్టించిన తరువాతనే సంక్షేమ పథకాలు అందిస్తాము అంటూ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు అంటూ రోజా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.