రేవంత్ రెడ్డి రాజకీయం ముందు తేలిపోతున్న సీనియర్స్

why revanth reddy suddenly changed his priority?

 తెలంగాణ లో నానాటికి తీసికట్టుగా మారిపోతున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపే సత్తా ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని చాలా మంది అనుకుంటున్నా మాట, ఆ మాటను నిజం చేసే విధంగా రేవంత్ రెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే నియోకవర్గాల వారీగా పాదయాత్ర అంటూ మొదలుపెట్టి అదిరిపోయే ఎండింగ్ ఇచ్చి, తెలంగాణ కాంగ్రెస్ ఆశాజ్యోతి తాను ఒక్కడే అంటూ మరోసారి రుజువు చేశాడు.

revanth reddy padayatra

 రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రను ఒక్క ప్రధాన మీడియా కూడా కవరేజ్ చేయలేదు. కానీ ముగింపు సభకు మాత్రం భారీ సంఖ్యలో ప్రజలు హాజరై బ్రహ్మరధం పట్టారు. రేవంత్ ఒక పథకం ప్రకారమే ఈ పాదయాత్రను మొదలుపెట్టాడు. మొదటి నుండి జన సమీకరణ విషయంలో పక్క ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టటం కాంగ్రెస్ సీనియర్ నేతలకు సుతారం ఇష్టం లేదు. దీనితో ముగింపు సభను ఫెయిల్ అయ్యేలా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. రేవంత్ సభకు హాజరుకావద్దని క్యాడర్‌కు నేరుగా సీనియర్లు ఆదేశాలు పంపారు. అయినా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు రేవంత్ వెంట నడిచారు. దీంతో రేవంత్‌ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తే మొత్తం పార్టీ కేడర్ అంతా ఆయన వెంట నడుస్తుందన్న అభిప్రాయం.. ఇప్పటికే ప్రారంభమయింది.

 ఒక రకంగా ఈ పాదయాత్ర ద్వారా పార్టీ హై కమాండ్ కు తన సత్తా ఏమిటో చూపించాడు. రేవంత్‌కు పోటీగా అని చెప్పుకుంటున్న నేతలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. భట్టి విక్రమార్క్ కూడా యాత్ర చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మిగిలిన నేతలు చేస్తున్న పాదయాత్రకు తాను కూడా హాజరవుతానంటూ రేవంత్ రెడ్డి ప్రకటించటం జరిగింది. దీనిని బట్టి చూస్తే తన మొదటి ప్రాధాన్యత పార్టీనే అంటూ చెప్పకనే చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి రాజకీయం ముందు ఆ పార్టీ సీనియర్ నేతలు తేలిపోతున్నారు