రైతులెవరు నష్టపోలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి..!

కొన్ని రోజుల నుండి రాష్ట్రాలలో తీవ్రమైన వర్షపాతం ఉన్న సంగతి తెలిసిందే. ఇక పలుచోట్లలో తీవ్రమైన వరదలతో ఇంటి లోపలి వరకు వర్షం నీళ్లు వస్తున్నాయి. మరోవైపు రైతులు తమ పంట పొలాలు నష్టపోతున్నాయని తీవ్ర దుఃఖంలో ఉన్నారు. కానీ ఇటీవలే మంత్రి కేటీఆర్ భారీ వర్షాలతో రాష్ట్రంలో రైతులు ఎవరు నష్టపోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనపై బాగా ఫైర్ అవుతూ.. ఇద్దరం కలిసి అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పర్యటిద్దాము అని.. ఎకరం పంట కూడా మునగకపోతే తాను ముక్కు నేలకు రాస్తానని అన్నారు రేవంత్. ఇక పంట నష్టం జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెబుతావా అంటూ ప్రశ్నించారు.