చంద్రబాబును కష్టాల నుండి గట్టెంక్కించగల మొనగాడు రేవంత్ రెడ్డి ఒక్కడే ?

ఏ స్నేహమూ లేక ఒంటరిగా మారిపోయిన చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడిపోతున్నారు.  బీజేపీ అధిష్టానాన్ని మెప్పించడానికి పిల్లిమొగ్గలు వేస్తున్నారు.  బీజేపీ ఏం మాట్లాడితే అదే రైట్ అంటూ ఫాలో అవుతున్నారు.  బీజేపీ నేతలు ఎన్ని మాటలన్నా ఎదురుతిరిగటంలేదు.   ఇంతా చేస్తున్నా బీజేపీ అధిష్టానం మాత్రం చంద్రబాబును లెక్కచెయ్యట్లేదు.  కూరలో కరివేపాకు తీసిపారేసినట్టు తీసిపారేస్తోంది.  ఎన్ని విధాలుగా కవ్వించినా టీడీపీతో పొత్తు జరగని పని అంటూ సోము వీర్రాజు తేల్చి చెప్పేశారు.  దీంతో బాబుగారికి అన్ని దారులు మూసుకుపోయాయి.  

Revanth Reddy is only hope Chandrababu Naidu
Revanth Reddy is only hope Chandrababu Naidu

ఇలా ఒంటరిగా మిగిలి నిరాశలో కుంగిపోతున్న చంద్రబాబుకు తెలంగాణాలో కొత్త దారి కనిపిస్తోంది.  అది కూడా ఆయన ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి రూపంలోనే కావడం విశేషం.  తెలంగాణలో బలంగా నిలబడాలని భావిస్తున్న బీజేపీ రేవంత్ రెడ్డి మీద దృష్టి పెట్టింది.  తమ పార్టీలో కూడ ఒక మాస్ లీడర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో రేవంత్ అయితే బాగుంటుందని, కేసీఆర్ కు ఎదురు నిలవాలంటే అతనే సరైన మార్గమని భావించిన హైకమాండ్ రేవంత్ రెడ్డిని పార్టీలోకి లాగాలని విశ్వప్రయత్నం చేస్తోందట.  సామాన్య ప్రజలకే ఈ సంగతి తెలుస్తోంది అంటే చంద్రబాబు నాయుడుకు తెలియకుండా ఉంటుందని అనుకోలేం కదా.  ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేయడం ఖాయం. 

రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.  తాను వేరే పార్టీలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అంటే అభిమానం, గౌరవం ఏమాత్రం తగ్గదని రేవంత్ రెడ్డి అనేకసార్లు బహిరంగంగానే అన్నారు.  కాబట్టి తాను బీజేపీలోకి రావాలంటే ఆంధ్రాలో బీజేపీ చంద్రబాబుతో చేతులు కలపాలనే కండిషన్ రెవనే రెడ్డి వైపు నుండి వినిపించే అవకాశాలున్నాయి.  అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సపోర్ట్ కావాలంటే ఆంధ్రాలో టీడీపీకి బీజేపీ మద్దతు ఉండాలనేది డీల్ అన్నమాట.  ఇదే ఒప్పందం తెరమీదకు వచ్చి ఏపీలో టీడీపీ, బీజేపీలు చేతులు కలిపితే మాత్రం చంద్రబాబు కష్టాలు కొంచమైనా గట్టెక్కినట్టే.