Corona Virus: కరుణ వైరస్ గత రెండు సంవత్సరాలుగా దేశంలో కలకలం సృష్టిస్తోంది. ఈ మధ్యకాలంలో కరుణ కేసులు కొంచెం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కరుణ ఒక్కో దశలో ఒక్కో విధంగా రూపాంతరం చెందింది కొత్త కొత్త వేరియంట్ లతో బీభత్సం సృష్టించింది. కరోనా మొదటి రెండవ వేళలో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా థర్డ్ వేవ్ కొంత ఊరటనిచ్చింది. ప్రస్తుతం కరుణ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలలో కరోనా ఫోర్త్ వేవ్ గురించి అలాగే ఉంది.
ఈ ఈ సమయంలో ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ప్రముఖ ప్రఖ్యాత వైరాలజిస్ట్ డాక్టర్ టి.జాకోబ్ జాన్ దేశంలో కొవిడ్-19 నాలుగో వేవ్ ఉండకపోవచ్చని దేశ ప్రజలు శుభవార్త చెప్పారు .భారత వైద్య పరిశోధన మండలి (icmr )కి చెందిన వైరాలజీ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్‌కు గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ టి జాకబ్ జాన్ మాట్లాడుతూ కరోనా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ పూర్తిగా ముగిసిందని.. కొత్త వేరియంట్ వస్తె తప్ప ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం ఉండదని ఆయన వెల్లడించారు. కరోనా చివరి దశకు చేరిందని ఆయన వెల్లడించారు.
భారత దేశంలో తాజాగా మంగళవారం రోజు 3993 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లాగా శ్వాస కోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక దేశ ప్రజలు హాయిగా ఊపిరి తీసుకోవచ్చని, కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.గతంలో వచ్చిన శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ ఇన్‌ఫ్లుఎంజా కారణంగానే జరిగాయని.. ప్రతి ఇన్‌ఫ్లుఎంజా మహమ్మారి సెకండ్ లేదా థర్డ్ వేవ్ తో ముగిసిందని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు.