వయస్సుతో, కాలంతో సంబంధం లేకుండా వేధించే ఆరోగ్య సమస్యలలో జలుబు, దగ్గు ముందువరసలో ఉంటాయి. జలుబుకు మందులు వాడినా వాడకపోయినా ఒకే తరహా ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. జలుబు విషయంలో తలనొప్పి, దగ్గు, తుమ్ములు సమస్యలతో బాధ పడే అవకాశం ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జలుబు సమస్య సులువుగానే దూరమవుతుంది.
జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టడం వల్ల మంచి ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. జలుబు చేసిన స్మాయంలో వేడి చేసి నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది. నీటిలో దాల్చినపొడి కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టడం వల్ల మంచి ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి.
ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడినీటితో మాత్రమే కాకుండా పసుపు, బామ్ వంటివి వేయడం మంచిది. వేడినీటిలో యూకలిప్టస్ ఆయిల్ కూడా వేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. వేడినీటిలో పసుపు కలుపుకొని తాగడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పసుపులోని యాంటీ బయాటిక్ గుణాలు జలుబుని దూరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి.
అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం లభించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. రెగ్యులర్‌గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకుంటే అవకాశాలు ఉంటాయి. జలుబు ఉన్నవారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మిరియాల పాలు తాగినా జలుబు త్వరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ మిరియాలతో కషాయం చేసుకుని తాగినా మంచి ఫలితాలు పొందవచ్చు.
ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. దగ్గు వదలకుండా వస్తుందంటే.. ఆ స మయంలో వాముని నమిలి ఆ రసాన్ని మింగితే మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్లు వీటన్నింటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి.