మడమల పగుళ్లకు అద్భుతమైన చిట్కాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలు దూరం?

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది పాదాల పగుళ్ల సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధంలా పని చేస్తుందని చాలామంది భావిస్తారు. ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది.

పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇతర కారణాల వల్ల ఈ సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలతో బాధ పడే వాళ్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

పాదాల పగుళ్లకు చికిత్స కోసం వెజిటేబుల్ ఆయిల్స్ ను వినియోగిస్తే మంచిదని చెప్పవచ్చు. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనెలను ఇందుకోసం వినియోగించవచ్చు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగి మృత చర్మం తొలగిపోయేలా రుద్దాల్సి ఉంటుంది. సాక్సులు ధరించి నిద్రించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు.

బియ్యం పిండితో పాదాల పగుళ్లను తగ్గించవచ్చు. బియ్యం పిండి, కొన్ని చెంచాల తేనె, ఆపిల్ సీడర్ వెనిగర్ పేస్ట్ లా చేసుకుని పాదాలకు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వేపాకులతో సైతం పాదాల ఇన్ఫెక్షన్లు తగ్గించే అవకాశాలు ఉంటాయి. పాదాలు దురద పెడుతూ, ఇన్ఫెక్షన్ ఇబ్బంది కలిగిస్తే వేపాకు పేస్ట్ ను అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.