AP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అయితే గతంలో ఓకే పార్టీ రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చేది కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితులు మారిపోతున్నాయి. ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఎవరూ కూడా ముందుకు రాలేదని తెలుస్తుంది. 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ నుంచి పెట్టుబడులు తీసుకువచ్చారు. అయితే 2019 లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి కాదు అంటూ మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి తీసుకువచ్చారు.
ఈ విధంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సింగపూర్ కి సంబంధించిన కొన్ని కంపెనీలు వారి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లారు అయితే ఈయన సింగపూర్ పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే సింగపూర్ ప్రభుత్వానికి కొన్ని మెయిల్స్ ఏపీ నుంచి వెళ్లాయని తాజాగా మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఈ మెయిల్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు సంవత్సరాలలో ప్రభుత్వం మారబోతుందని ఎవరు కూడా పెట్టుబడులు పెట్టొద్దు అంటూ మెయిల్ వెళ్లినట్లు తెలియజేశారు. ఇక ఈ విషయం గురించి అక్కడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే ఈ మెయిల్ చేసిన వ్యక్తి పేరు మురళీకృష్ణ అంటూ లోకేష్ తెలియజేశారు. మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వంలో మంత్రులు, హైకమిషనర్ కు సైతం మెయిల్స్ పంపాడని, ఏపీలో అస్థిర ప్రభుత్వం ఉందని, ఈసారి ప్రభుత్వం మారిపోబోతోందని ఈ మెయిల్ లో ఉందని నారా లోకేష్ తెలిపారు. కాబట్టి ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని కూడా ఉందులో కోరాడన్నారు. దీనిపై ఆరా తీస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ అనే సంస్ధలో పనిచేసే ఉద్యోగిగా తేలిందన్నారు. ఇది రాజకీయాల్ని నేరపూరితం చేయడమే అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
