మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి.. వైసీపీ గెలుపు కోసమే ఈ నిర్ణయమా?

ap bjp targets ycp mp vijayasai reddy

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా తాను మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపారు. వైసీపీకి ఇప్పటికే సొంతంగా న్యూస్ ఛానల్ ఉండటంతో పాటు టీవీ ఛానల్ కూడా ఉంది. మరి విజయసాయిరెడ్డి న్యూస్ ఛానల్ ను మొదలుపెడతారో లేక పత్రికను మొదలుపెడతారో క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మీడియా రంగంలోకి ఎంట్రీ గురించి వెల్లడించారు.

టీడీపీ అనుకూల మీడియాపై మండిపడిన విజయసాయిరెడ్డి టీడీపీ అనుకూల పత్రికలను కరపత్రికలతో పోల్చారు. తన ఆస్తుల గురించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆస్తుల విషయంలో తాను విచారణకు సిద్ధమని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే వైసీపీ గెలుపు కోసమే విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక జగన్ ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా చంద్రబాబు అనుకూల మీడియాకు సంబంధించిన ఛానెళ్లు, వెబ్ సైట్లు, న్యూస్ పేపర్లు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా వైసీపీ గురించి చెడుగా ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఈ కారణం వల్లే మీడియా సపోర్ట్ మరింత పెరగాలనే ఆలోచనతో విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఈ రంగంలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

విజయసాయిరెడ్డి కొత్త పత్రికలను, కొత్త ఛానెళ్లను మొదలుపెట్టడానికి బదులుగా ఇప్పటికే ఉన్నవాటిలో పెట్టుబడి పెడితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విజయసాయిరెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి. 2024 ఎన్నికల్లో కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మీడియా సపోర్ట్ కూడా ఉంటే వైసీపీ మరిన్ని ఎక్కువ సీట్లలో విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంది.