చిక్కుల్లో మాజీ టీడీపీ ఎంపీ.. షాకింగ్ మ్యాట‌ర్ ఇదే..!

తెలుగుదేశం పార్టీ నేత‌, మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు తాజాగా ఊహించ‌ని చిక్కుల్లో ఇరుక్కున్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఆస్తులను వేలం వేస్తున్నట్లు బ్యాంకులు ప్ర‌క‌టించ‌డం, హాట్ టాపిక్ అవుతోంది. ఇప్ప‌టికే సీబీఐతో పాటు ఈడీ కేసును ఎదుర్కుంటున్న రాయ‌పాటికి, మ‌రో కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 452 కోట్ల‌ రూపాయల వరకు బకాయి పడ్డాడు. దీనికి సంబంధించి ట్రాన్స్ ట్రాయ్ ఆస్తుల్ని గ్యారెంటీగా పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే తీసుకున్న రుణాలు పెద్ద మొత్తంలో ఉండ‌డం, మ‌రోవైపు వాటిని తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్ లిస్ట్‌లో పడిపోయింది.

అంతే కాకుండా రాయ‌పాటి కంపెనీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ మొత్తం చెల్లించకపోవడంతో ఇప్పటికే సిబిఐ కేసు పెట్టిన ఆ బ్యాంక్ ఇ్పపుడు ఆస్తుల వేలం నోటీసు ఇచ్చింది. ఈ క్ర‌మంలో ట్రాన్స్ ట్రాయ్ ఆస్తులను వేలానికి పెట్టినట్టుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఆగస్టు18న‌ వేలం పాట జరుగుతుందని, దీంతో బిడ్డింగ్‌లు వేయ‌డానికి కూడా ఆహ్వానిస్తూ.. ఆగస్ట్ 14 వ‌ర‌కు బిడ్లువేయ‌డానికి అవ‌కాశం ఇచ్చారు.