మిస్సయినవారిని మిస్సవ్వొద్దంటున్న బాబు… కారణం కామనే!

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని రెండు రోజుల పాటు మహానాడు ను టీడీపీ నేతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి లో మే 27, 28 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ను పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు సమర శంఖం పూరించారు. అనంతరం తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించారు. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి కొంతమంది సీనియర్ నేతలు, కీలక నేతలు గైర్హాజరయ్యారు. దీంతో… వారందరికీ బాబు టచ్ లోకి వెళ్లారని తెలుస్తుంది. ఈ సందర్భంగా వారికి ఒక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం.

తాజాగా జరిగిన మహానాడుకు ఈ మహానాడుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. అయితే కొంతమంది సీనియర్లు, కీలక నేతలు మాత్రం గైర్హాజరయ్యారు. ఇలా గైర్హాజరైన వారిలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన తనయుడు రాయపాటి రంగారావు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇలా పలువురు కీలక నేతలు మహానాడుకు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారిందంట!

దీంతో కారణాలు తెలియక ఆందోళన చెందిన బాబు… వారందరికీ టచ్ లోకి వెళ్లారంట. మహానాడుకు హాజరుకాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారని సమాచారం. అనంతరం అలర్ట్ అయిన బాబు… వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టాలని, జగన్ ను విమర్శించాలని కోరారంట. అలాచేయని పక్షంలో కార్యకర్తల్లో కొత్త అనుమానాలు తలెత్తే పరిస్థితి ఉందని బాబు సూచించారంట. దీంతో తాజాగా గంటా శ్రీనివాస రావు ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీ మ్యానిఫెస్టో అద్భుతమని చెప్పుకొచ్చారు. ఇక మిగిలినవారు ఎప్పుడు పెడతారనేది వేచి చూడాలి.

అయితే… టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో… వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లు మహానాడుకు హాజరుకాలేదు. వీరు వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన 19మందిలో సుమారు 15 మంది వరకు గైర్హాజరవ్వడం గమనార్హం!!

కాగా… బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో తన సీటును విష్ణు కుమార్ రాజు కు ఆఫర్చేయబోతున్నారని కథనాలు వస్తున్న నేపథ్యంలో గంటా అలిగారని వార్తలొచ్చాయి. ఇదేసమయంలోతనతో పాటు తన కుమారుడికి కూడా సీటు ఇవ్వాలని రాయపాటి డిమాండ్ చేసిన సంగతితెలిసిందే. ఇదే సమయంలో సత్తెనపల్లి సీటుపై కోడెల శివరాం అలకపానుపు ఎక్కగా, ఈసారి తమతో పాటు తమ వారసులకూ టిక్కెట్లు ఇవ్వాలని జేసీ బ్రదర్స్డిమాండ్ చేస్తున్నారు!