‘కిలాడీ’ యూనిట్ కు షాక్ ఇచ్చిన వీసా అధికారులు !

Raviteja khiladi movie updates

‘క్రాక్’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజా రవితేజ ఆ జోష్ లోనే ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడీ” మూవీ షూటింగ్ మొదలుపెట్టేసిన రవి దీని తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ మూవీ షూటింగ్ 90 శాతం పూర్తవగా ఇంకా రెండు సాంగ్స్, రవితేజ పాత్రకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను గల్ఫ్ దేశాలలో చేయటానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే వీసాల కోసం ఖిలాడీ యూనిట్ ఎప్పుడో ధరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ యూఏఈ వీసా అధికారులు వాటిని అంగీకరించలేదట. దాంతో ఇక చేసేదేమీ లేక హైదరాబాద్ లోనే కానిచ్చేస్తున్నారని తెలుస్తుంది.

Raviteja khiladi movie updates

కానీ రవితేజ పాత్ర దుబాయ్ కి చెందినవాడు కావటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సన్నివేశాలను అక్కడనే చెయ్యాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్స్ వేసి అందులో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసేసి ఆ తర్వాత కొంచెం లేట్ అయినా దుబాయ్ వెళ్లాల్సిందేనట. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై కొనేరు సత్యనారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.