Rashmika: సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న రష్మిక… పరువు మొత్తం తీస్తున్న నెటిజన్లు!

Rashmika: రష్మిక మందన్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ మాత్రం విరామం లేకుండా వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని సందర్భాలలో తనకు తెలియకుండా నోరు జారుతూ వివాదాలలో నిలుస్తున్నారు. అయితే గత కొంతకాలంగా తన కమ్యూనిటీ గురించి రష్మిక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

కూర్గ్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మొట్టమొదటి నటి నేనే అంటూ రష్మిక తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు. ఇలా రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలపట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొడవ జాతి నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ మీరు కాదని మీకంటే కూడా ఎంతోమంది ఇండస్ట్రీలోకి ముందుగా వచ్చారు అంటూ విమర్శలు కురిపించారు. అయితే ఈ వివాదం పై తాజాగా సీనియర్ నటి ప్రేమ కూడా స్పందించారు.

ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యల గురించి ప్రేమ స్పందిస్తూ.. ఈ విషయంలో తానేమి చెప్పగలను.. కొడవ సమాజానికి నిజం ఏంటనేది తెలుసు. రష్మిక వర్షన్ గురించి తనకే తెలుసని,కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సులభం చేశారని ప్రేమ తెలిపారు.
కొడవ జాతికి చెందినవారు నాకంటే ముందుగా నటీనటులుగా ఇండస్ట్రీలో ఉన్నారు. శశికళ అనే నటి సహాయ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగారు. ఆ సమయంలోనే నేను కూడా ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టానని అనంతరం ఎంతోమంది కొడవ జాతికి చెందిన వారు ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్నారని ప్రేమ తెలిపారు.. ఇలా వీరందరూ ఇండస్ట్రీలో కొనసాగుతూ నటి రష్మిక మందన్నకు మార్గం సులబతరం చేశారంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.