Rashnika Mandanna: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు తమిళం హిందీ కన్నడ సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. కాగా గత కొంతకాలంగా రష్మిక నటిస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.
ఇది ఇలా ఉంటే రష్మిక కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోలింగ్ కి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. రష్మిక ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. దాంతో రష్మిక సైతం తనపై వచ్చే ట్రోల్స్ పై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. నేను బావోద్వేగాలు కలిగిన ఒక అమ్మాయిని. అయితే వాటిని నేను బయటకు వ్యక్తం చేయడానికి ఇష్టపడను.
అలా చేస్తే రష్మిక కెమెరా కోసం చేస్తున్నారు అని అంటారు. ఇకపోతే నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు. వారు ఎందుకు అంత క్రూరంగా మారుతున్నారో అర్థం కావడం లేదు. అలా నా ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. ఇలాంటి చర్యలు చాలా బాధిస్తున్నాయి. నాపై ప్రేమ, అభిమానాలు కురిపించకపోయినా పర్లేదు. కానీ ప్రశాంతంగా ఉండండి చాలు అంటూ రష్మిక తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి మా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
Rashmika Mandanna: డబ్బులు ఇచ్చి మరి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!
