Hero Wife: మామూలుగా చాలామంది సామాన్యులు హీరోల కుటుంబంలో జన్మించాలని, హీరోలు తెలిసినవాళ్లు అయితే చాలా మేలు అని సెలబ్రిటీ హోదాను దక్కించుకోవాలని, సెలబ్రిటీలు అనే పిలుపు కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది స్త్రీలు అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలు భార్యలు చాలా లక్కీ అంటూ కూడా వాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే స్టార్ హీరోల భార్యలుగా మారడం అన్నది అదృష్టమే అయినప్పటికీ, కొందరు మాత్రం కేవలం వారి భార్యలుగా దక్కిన అదృష్టంతో మాత్రమే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు.
తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అలా సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల భార్యలు తమని తాము నిరూపించుకుంటూ తమకంటూ ఒక సంత గుర్తింపును ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టార్ హీరో భార్య అనే పేరుని పదేపదే ప్రస్తావించకండి అని అంటోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకు ఆమె ఆ విధంగా కోరుకుంటుంది అన్న విషయానికి వస్తే.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ తాజాగా ఒక ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా సుప్రియా మీనన్ మాట్లాడుతూ.. నన్ను తరచు ప్రృధ్వీరాజ్ సుకుమారన్ భార్యగా పిలవడం అన్నది కరెక్ట్ కాదు. నేను కేవలం ఒక టాప్ హీరో, నటుడు, సినీ ప్రముఖుడు పృథ్వీరాజ్ భార్యగా మాత్రమే పరిగణన పొందాలనే దానిని కోరుకోవడం లేదు. నా సొంత కెరీర్‌లో ఒక విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. నా కంటూ స్వంత ఇమేజ్ సృష్టించుకోవాలనే కోరిక ఉంది. ఏ మగవాడికి సంబంధించి అయినా అతని భార్య, అతని తల్లి లేదా అతని కుమార్తెగా తగ్గిపోకూడదని నేను కోరుకుంటున్నాను అని తెలిపారు సుప్రియా మీనన్.
Hero Wife: హీరో భార్య అని పిలవకండి.. సంచలనం వాఖ్యలు చేసిన స్టార్ హీరో వైఫ్!
