విజయ్ దేవరకొండతో ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చిన రష్మిక…?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టి.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి “గీతా గోవిందం” సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. ఇలా ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవటంతో “డియర్ కామ్రేడ్స్” సినిమాలో కూడా జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్స్ సినిమాలలో నటించే సమయంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడి అది ప్రేమగా మారిందని చాలా కాలంగా వీరి గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల ఈ జంట మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేయటంతో వీరి ప్రేమ గురించి వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక… సోషల్ మీడియాలో ఈ విషయం గురించి వస్తున్న వార్తలను చూస్తుంటే చాలా సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా వీరిద్దరూ మాల్దీస్ వెకేషన్ పూర్తిచేసుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించగా…విజయ్ తో నేను చాలా‌ క్లోజ్ గా ఉంటా. తనతో అన్ని విషయాలు పంచుకుంటా. కానీ మా మధ్య ఎటువంటి ప్రేమ లేదు… మేం స్నేహితులం మాత్రమే` అని చెబుతూ.. వారి రిలేషన్‌ గురించి వస్తున్న రూమర్స్ కి చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది.