ఫాదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ అయిన రష్మి.. తన తండ్రి గురించి ఏం చెప్పిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మి గౌతమ్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమా ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రష్మి జబర్దస్త్ యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. ఒడిశా ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు తన అందాలతో పాటు.. వచ్చి రాని తెలుగు భాష మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే రష్మి ఫాదర్స్ డే సందర్భంగా స్టేజ్ మీద బాగా ఎమోషనల్ అయ్యింది. ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు కమెడియన్ ల తో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమెడియన్లతో పాటు వారి తండ్రులు కూడా సందడి చేశారు.

ఒకవైపు టీవీ షోలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉండే రష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు తన అభిమానులతో పంచుకునే రష్మి తన వ్యక్తిగత విషయాల గురించి మాత్రం ఎప్పుడూ బయట పెట్టదు. ఇప్పటికే రష్మి పర్సనల్ విషయాలు గురించి ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదివరకే రష్మి కి పెళ్ళి అయ్యిందని, కానీ తన తల్లి లాగా భర్తకు దూరంగా ఉంటుందని సమాచారం. రష్మీ తల్లి కూడా ఒంటరిగా కష్టపడి కూతురిని పెంచింది. ఆమె భర్త చనిపోయాడా? లేక ఆమెను వదిలేశాడో కూడా తెలియదు. ఎందుకంటే రష్మి ఎప్పుడూ తన తండ్రి గురించి ఎక్కడా బయటపెట్టలేదు.

ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు నిర్వహించిన కార్యక్రమంలో వర్ష, పవిత్ర తమ తండ్రుల గురించి తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఇక రష్మి కూడా మాట్లాడుతూ..తన తండ్రి గురించి పరోక్షంగా స్పందించింది. పేరెంట్స్‌లో చెడ్డ పేరెంట్స్ ఉంటారో లేదో నాకు తెలియదు.. అయినా సరే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అంటూ స్టేజ్ మీదే రష్మి చాలా ఎమోషనల్ అయింది. రష్మీ అందరికీ ఇలా తన తండ్రి గురించి చెప్పడం ఇష్టం లేక, చెడుగా చెప్పలేక అలా పరోక్షంగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ వారు నిర్వహించిన కార్యక్రమంలో కమెడియన్స్ తండ్రులు కూడా సందడి చేస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నారు.