Rana Daggupati: శేఖర్ కమ్ముల అనగానే క్లాసిక్ సినిమాల దర్శకుడు అనొచ్చు.తన మొదటి చిత్రం డాలర్ డ్రీమ్స్ నుండి నేటి లవ్ స్టోరీ వరకు ప్రతి చిత్రంలోను కథనే హీరో. కమర్షియల్ చిత్రాల హవా నడిచే టాలీవుడ్ లో కథను నమ్ముకుని సినిమాను తీసే దర్శకులు తక్కువ. అందులో శేఖర్ కమ్ముల ముందుంటారు. శేఖర్ కమ్ముల, రానా కాంబినేషన్ లో వచ్చిన లీడర్ సినిమా రాజకీయాలకు సంబందించిన చిత్రం .
ఈ సినిమా తీయాలనీ శేఖర్ కమ్ముల చాలా మంది హీరోలను సంప్రదించగా కథను వారికి అనుగుణంగా మార్చాలని డిమాండ్ ఎక్కువగా రావడంతో కొత్త హీరో తో సినిమా చేయాలనీ భావించారు. అలా రానాతో ఈ సినిమా తీశారు. రానాకు ఈ సినిమా మొదటి సినిమా అయినా ఏ మాత్రం కొత్త హీరోలాగా ఈ సినిమాలో నటించలేదు. చాలా అనుభవం ఉన్న హీరోలా అర్జున్ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయారు.
ఇపుడు ఈ సినిమా సీక్వల్ రానున్నదనే ఊహగనాలు ఉపందుకున్నాయి. భీమ్లా నాయక్ ప్రమోషన్స్ లో భాగంగా రానా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలా ఒక ఇంటర్వ్యూ లో లీడర్ సీక్వల్ గురించి ప్రస్తావించగా శేఖర్ కమ్ముల లీడర్ సీక్వల్ గురించి మాట్లాడారని రెండు మూడు డైలాగులు కూడా చెప్పారని కొంత కాలానికి మళ్ళీ సైలెంట్ అయిపోతారని చెప్పారు రానా. లీడర్ సినిమా 2010 ఫిబ్రవరి 19న రిలీజ్ అయింది. అన్ సీజన్ లో రిలీజ్ అయిన లీడర్ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోయిన క్లాసిక్ చిత్రంగా మిగిలిపోయింది.ఈ సినిమాలో రానాకు జంటగా రీఛా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. ఇపుడు ఈ సినిమా సీక్వల్ తెస్తే ఇలాంటి పొలిటికల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడో శేఖర్ ఖమ్ముల వేచిచూడాలి.