అందరూ ప్రస్తుతం గురించి ఆలోచిస్తే.. ఆయన మాత్రం 20 ఏళ్ల తర్వాత జరిగేదాని గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయగలిగే వ్యక్తిలో ఆయన ఒకరు. అలాగని ఏదో జ్యోతిష్యాన్ని నమ్ముతాడు అని అనుకుంటే తప్పే. వచ్చే 20 ఏళ్లలో ఏ రంగంలో అయినా ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతాయి.. అనే విషయాన్ని ముందే పసిగట్టే సత్తా రామోజీరావు దగ్గర ఉంది. అందుకే ఆయన మీడియాకే మొఘల్ అయ్యారు. అంతేనా.. ఆయన ఏ రంగంలో బిజినెస్ ప్రారంభించినా సక్సెస్ అయ్యారు.
ఓటమి ఎరుగని ధీరుడు రామోజీ అని అందరూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తేవారు. కానీ.. కరోనాకు ముందే ఆయన ఓటమి అంటే ఏంటో తెలియని వ్యక్తి. కరోనాతో ఆయన ఓటమిని కూడా చవి చూడాల్సి వచ్చింది. ఓటమిని చవి చూసినా ఆయనలో ఏమాత్రం కూడా నమ్మకం చెక్కు చెదలేదు. న్యూటన్ చెప్పినట్టు చర్యకు ప్రతిచర్య ఎలాగే.. అంతే స్పీడ్ గా ఆయన మళ్లీ పుంజుకున్నారు.
ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేయబోతున్నారు. అదే ఓటీటీ బిజినెస్. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలుసు. కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో సినిమాల రిలీజ్ కు ప్లాట్ ఫామ్ లు లేక చాలా ఇబ్బందులు వస్తున్నాయి.
అయితే.. ఇప్పటికే కొన్ని ఓటీటీలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇంకా ఈ రంగంలో స్పేస్ ఉంది. అందుకే… రామోజీరావు ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట.
ఇప్పటికే ఈటీవీ విన్ అనే యాప్ ఉన్నప్పటికీ.. అది కేవలం ఈటీవీలో వచ్చే కార్యక్రమాలకు సంబంధించిన యాప్. దాన్నే కొంచెం అభివృద్ధి చేసి ఓటీటీగా సెట్ చేయడమో.. లేదంటే కొత్త ఓటీటీ ప్లాట్ ఫాంను తీసుకురావడమా? అని రామోజీ ఆలోచిస్తున్నారట.
ఏది ఏమైనా అతి త్వరలోనే రామోజీ గ్రూప్ నుంచి మరో బిజినెస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ రూపంలో మార్కెట్ లోకి రాబోతున్నది.
ఇప్పటికే రామోజీ రావు.. ఈటీవీ భారత్ పేరుతో ఒక యాప్ ను తీసుకొచ్చారు. దాని కోసం సుమారు 300 కోట్లు ఖర్చు పెట్టారట. కానీ.. అది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు అనేది టాక్. అయినప్పటికీ.. రామోజీ మాత్రం వెనుదిరగలేదు. ఈటీవీ భారత్ తో పాటు ఈటీవీ విన్ అనే యాప్ ను డెవలప్ చేయించారు.
ఇప్పుడు ఓటీటీ మీద పడ్డారు. ఏది ఏమైనా ప్రతి విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించే సత్తా ఉన్న రామోజీ.. ఈసారి ఓటీటీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.