ఈనాడు పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త శ్రీ రామోజీరావు గారు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రగాడ సంతాపం తెలియజేసింది. ఈరోజు ఉదయం ఆయన హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, భారతీయ చలనచిత్ర పరిశ్రమ, మీడియా పరిశ్రమ, వినోద పరిశ్రమకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ కోలుకోలేని నష్టాన్ని అధిగమించే శక్తిని మరియు ధైర్యాన్ని వారి కుటుంబానికి ఇవ్వాలని శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ మా సానుభూతి తెలియజేస్తున్నాం అన్నారు.
ఓం శాంతి…జోహార్ రామోజీరావు గారు
అధ్యక్షులు :: సునీల్ నారంగ్
గౌరవ కార్యదర్శి :: కె అనుపమ్ రెడ్డి