కరోనాతో ఓ వైపు ప్రజలు బెంబేలెత్తిపోతుంటే? మరో వైపు మహమ్మారి సోకిందనో..సోకుతుందనో భయాందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే..విజయవాడ కొవిడ్ సెంటర్లో మానవ తప్పిదం కారణంగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో 10 మంది అమాయకులు బలైపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసింది. తాజాగా జేసీ శివశంకర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసుంది. రమేష్ ఆసుపత్రి-స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా కారణంగా ఘటన జరిగిందని తెలిపింది. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని నివేదిక లో పేర్కొంది.
ఈ కమిటీ పుణ్యమా అని రమేష్ ఆసుపత్రి కొవిడ్ పేరు చెప్పి పెషంట్ల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు బయటపడింది. దీంతో రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ బాబు పరారయ్యారు. వీళ్ల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసారు. వీళ్లు పరారీలో ఉన్నారని ఘటన తర్వాతే వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ కనీసం పట్టించుకున పాపాన కూడా పోలేదు. జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రమేష్ ఆసుపత్రి తమ సామాజిక వర్గానికి చెందినది కావడం, దీనికి మించి చంద్రబాబుకు బాగా కావాల్సిన వ్యక్తి ఆసుపత్రి కావడంతో మౌనం దాల్చుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే ఈ ఘటనలో మృతి చెందింది ధనవంతులని తెలుస్తోంది. కరోనా భయంతో ఆక్కడ ముందస్తు జాగ్రత్తగా కొంత మంది బడా బాబులు రమేష్ ఆసుపత్రితో మాట్లాడుకుని ఆ విధమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు? అందుకు భారీగా ఫీజులు చెల్లించినట్లు చెబుతున్నారు. రమేష్ ఆసుపత్రి కొవిడ్ పేరిట స్వర్ణ ప్యాలెస్ ని అద్దెకు తీసుకుని ఇలాంటి కార్యాలే వెలగబెట్టినట్లు వినిపిస్తోంది. మరి రమేష్ ఆసుపత్రి స్వర్ణా ప్యాలస్ లు లాంటివి విజయవాడలో ఇంకెన్నింటిని వెలగబెట్టిందో.