Game Changer: గేమ్‌ ఛేంజర్‌ ఫ్లాప్…హీరో వచ్చి సాయం చేశాడా…మేము మరీ దిగజారలేదు!

Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థగా మంచి గుర్తింపు పొందిన వారిలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ఒకటి ఈ బ్యానర్ పై దిల్ రాజు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే దిల్ రాజుతో పాటు తన అన్నయ్య శిరీష రెడ్డి కూడా నిర్మాణ సంస్థలో భాగస్వామ్యం అవుతూ నిర్మాణ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ నిర్మాణ సంస్థ నుంచి తమ్ముడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.గేమ్‌ ఛేంజర్‌ వల్ల వచ్చిన నష్టాలతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని చెప్పారు. కానీ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అంతా మారిపోయిందని ఆయన అన్నారు. గేమ్‌ ఛేంజర్‌ వల్ల జీవితం పోయింది అనుకుంటే సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని నిలబెట్టిందని ఆ సినిమా లేకపోతే మా పరిస్థితి ఘోరం అని తెలిపారు.

గేమ్‌ ఛేంజర్‌ ఫ్లాప్ అయిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా మా పని అయిపోయింది అంటూ హేళన చేశారు.గేమ్‌ ఛేంజర్‌ పోయింది హీరో ఏమైనా వచ్చి మాకు సాయం చేశారా? డైరెక్టర్ వచ్చి సాయం చేశారా?అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్‌ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు. మాకు నచ్చే మేము వాళ్ళతో సినిమా చేశాము సినిమా పోయింది. రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని మేము ఎవరిని అడగలేదు మా నిర్మాణ సంస్థ ఇంకా అంత దిగజారిపోలేదు అంటూ శిరీష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్‌ను మేము కాపాడుకున్నాం. అయితే, గేమ్‌ ఛేంజర్‌ పోయిందని రామ్‌ చరణ్‌తో ఎలాంటి విభేదాలు రాలేదు. మరో కథ వస్తే ఆయన వద్దకు వెళ్తాం అంటూ శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.