Game Changer: దేవుడా… గేమ్ చేంజర్ సినిమా నిడివి 7 గంటలా…. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఎడిటర్!

Game Changer: ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఈ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజు భారీ నష్టాలను మూట కట్టుకోవాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 5 నెలలు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఇదే కారణం అంటూ ఇప్పటికే సంగీత దర్శకుడు కథ రచయిత పలు విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ సినిమా కోసం పనిచేసిన ఎడిటర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎడిటర్ షమీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా షమీర్ మాట్లాడుతూ…నేను కూడా గేమ్ ఛేంజర్ సినిమాకు పని చేశాను. నేను వర్క్ చేసినప్పుడు ఆ సినిమా నిడివి ఏడున్నర గంటలు. దాన్ని నేను మూడు గంటలకు ట్రిమ్ చేశాను. ఆ సినిమా ఏళ్ళ తరబడి సాగటం నాకు ఇతర కమిట్మెంట్స్ ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాను. ఈ సినిమా నాకు సరైన అనుభూతిని కలిగించలేదని షమీర్ తెలిపారు. ఇలా ఈ సినిమా నుంచి ఈయన తప్పకున్న తర్వాత
రూబెన్ ఎడిటర్ గా పనిచేసాడు. ఈ సినిమా ఫైనల్ గా 2 గంటల 45 నిమిషాల నిడివితో రిలీజయింది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అవ్వటమే కాకుండా మిగతా ఫుటేజ్ మొత్తం ఏమయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.