రాజమౌళిని బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్

ఇప్పుడున్న ఇండియన్ డైరెక్టర్స్ లో రాజమౌళి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన రాజమౌళి ఆ తర్వాత వచ్చిన ‘RRR ‘ తో మరో సారి తన సత్తా చాటుకున్నాడు. ‘స్టూడెంట్ నంబర్1 ‘ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అపజయమెరుగని దర్శకుడిగా పాపులర్ అయ్యాడు రాజమౌళి.

అయితే ప్రస్తుతం రాజమౌళిని బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండింగ్ కొనసాగుతోంది.
రాజమౌళిని బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు ఈ విధంగా పిలుపునివ్వడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

ఈ మధ్య బాయ్ కాట్ అనే ట్రెండ్ బాగా పాపులర్ అయ్యింది. బాయ్ కాట్ బాలీవుడ్, బాయ్ కాట్ ‘లాల్ సింగ్ చడ్డా’,  బాయ్ కాట్  ఆమిర్ ఖాన్, బాయ్ కాట్ ‘లైగర్’ అని నెట్లో చాలా హ్యాష్ట్యాగ్స్ పాపులర్ అయ్యాయి.

రాజమౌళి బాలీవుడ్ మూవీ అయిన బ్రహ్మాస్త్రం సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండాలని అలా ఉండకపోతే బాయ్ కాట్ చేస్తామంటూ పిలుపునిస్తున్నారు.

మరి బాయ్ కాట్ ట్రెండింగ్ గురించి రాజమౌళి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ఆశలన్నీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమాలో రన్బీర్, అమితాబ్ తో బాటు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.