Rajamouli: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశాయి. అంతేకాకుండా ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇది ఇలా ఉంటే రాజమౌళి చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి కోట్లల్లో కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలై రెండు షెడ్యూలను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే మూడవ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో జక్కన్న ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇకపోతే రాజమౌళికి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ అలాగే ఇతర దేశాలైన జపాన్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. జపాన్ లో రాజమౌళికి భారీగా అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలతో అక్కడ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Beyond excited for this ❤️ https://t.co/q1DvTXCK5r
— S S Karthikeya (@ssk1122) April 30, 2025
ఆయన సినిమాలకు అక్కడ కూడా ఫాన్స్ ఏర్పడ్డారు. ఇకపోతే ఇటీవల రాజమౌళి, అతని కొడుకు కార్తికేయ జపాన్ లో స్టార్ వీడియో గేమ్ డిజైనర్, రైటర్, డైరెక్టర్, నిర్మాత హిదేవు కొజిమతో వీడియో కాల్ మాట్లాడిన ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలోనే జపాన్ కి వెళ్ళినపుడు హిదేవు కొజిమ డైరెక్ట్ చేస్తున్న వీడియో గేమ్ లో కనిపించడానికి రాజమౌళి ఒప్పుకొని దానికి కావాల్సిన షూట్ కూడా పూర్తిచేసుకొని వచ్చాడు. ఈ వీడియో గేమ్ లో రాజమౌళి ది అడ్వెంచర్ గా, కార్తికేయ ది అడ్వెంచర్ సన్ పాత్రలలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారట. ఇటీవలే ఆ వీడియో గేమ్ రిలీజ్ అయింది. దీంతో జపాన్ లో కూడా రాజమౌళి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో గేమ్ తో రాజమౌళి జపాన్ లో మరింత వైరల్ అవుతుండగా మహేష్ సినిమా ప్రమోషన్స్ కి బాగా కలిసొస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.