RRR Movie Release : మళ్ళీ “RRR” కోసం సరికొత్త ప్లాన్స్ గీస్తున్న రాజమౌళి.?

RRR Movie Release :  దర్శక ధీరుడు రాజమౌళి లేటెస్ట్ గా చేసిన భారీ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఏ లెవెల్లో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు.

అయితే వీరందరి ఆశలకు చివరి నిమిషంలో కరోనా మూడో వేవ్ వచ్చి నీళ్లు జల్లింది. మరి ఈ భారీ సినిమాకు అప్పటి వరకు చేసిన భారీ ప్రమోషన్లు ఇంటర్వూస్, ప్లానింగ్ లు అన్నీ అకస్మాత్తుగా ఆపెసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఎలాగో మళ్ళీ కొత్త డేట్స్ ని ఇవ్వగా మళ్ళీ వీటికి తగ్గట్టుగా కూడా ప్లాన్ చెయ్యాలి కదా?

అందుకే రాజమౌళి మరింత కొత్త ప్లానింగ్స్ చేస్తున్నారట. తన సినిమాలు మార్కెట్ లోకి తీసుకెళ్లడంలో రాజమౌళి మాస్టర్ ఆ మాటకి తగ్గట్టుగానే ఇప్పుడు రెండు రిలీజ్ డేట్స్ కి తగ్గ ప్లానింగ్స్ నే మళ్ళీ చేస్తున్నాడట. ఎక్కడా తగ్గని విధంగా బ్యాలన్సుడ్ ప్రమోషన్స్ ని రాజమౌళి ఈసారి ప్లాన్ చేస్తున్నారట.

అలాగే కొత్త రకం ప్రమోషన్స్ ని రాజమౌళి ఆలోచిస్తున్నాడట. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా, అజయ్ దేవగన్ లు కీలక పాత్రల్లో నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.