Bahubali: బాహుబలి షూటింగ్‌లో ప్రభాస్ పక్కన నన్ను నిలబెట్టడానికి రాజమౌళి అలా చేశారు: కల్పలత

Bahubali: బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్‌తో కలిసి నటించడం తనకు చాలా ఆనందంగా అనిపించిందని ఆర్టిస్ట్ కల్పలత తెలిపారు. ఆ సినిమాలో ప్రభాస్‌ వస్తూ ఉన్నపుడు తామంతా ముసలి వాళ్లలా కనిపిస్తామని, అతను రాగానే ఆయన చెంపను నిమిరే సీన్ వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. అలా ప్రభాస్‌ను కలిసే సందర్భంలో అందరూ మగవాళ్లు తోస్తూ ఉంటారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి గారి గురించి చెప్పాలంటే ఆయన ఆడవాళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని ఆమె తెలిపారు.

ఇకపోతే తనను ప్రభాస్ పక్కన నించోబెట్టడానికి తనను రెండు చెక్కలపైన నిలబెట్టారని, ఆయన చాలా హైట్ ఉంటారని ఆమె చెప్పారు. అలా నిల్చున్నపుడు కూడా రాజమౌళి గారు తనను తోయకుండా ఉండేందుకు ఆయనకు సంబంధించిన వ్యక్తులనే పక్కన పెట్టారని ఆమె అన్నారు. ఇక ప్రభాస్‌ సర్ గురించి చెప్పాలంటే ఆయన చాలా గ్రేట్ అని, ఆయన తమకు చాలా దూరంగానే ఉంటారని ఆమె తెలిపారు. అంతే కాకుండా ఆయన అందరితోనూ బాగా మాట్లాడుతారని, వేరేలా ఉండడం అలా ఏం చేయరని ఆమె స్పష్టం చేశారు.

తాను ఇప్పటివరకు అగ్రహీరోలతో చేసిన యాక్టర్స్‌ అంటే ప్రభాస్, బన్నీ అని, రామ్ చరణ్‌ గారితో బ్రూస్‌లీ సినిమాలో నటించినా ఆ పాత్రలు ఇలా వచ్చి అలా పోయాయని కల్పలత అన్నారు. ఇక వివరాల్లోకి వెళ్లితే తనకు ప్రస్తుతం ముందున్న ప్రాజెక్టు పుష్ప 2 అని, అందులో కూడా తాను నటిస్తున్నానని ఆమె వివరించారు. కాగా తనకు పుష్పలో నటించేకంటే ముందు అసలు తనకు కథ ఏంటీ అనేది ఏ మాత్రమూ తెలియదని, అప్పటికప్పుడు చెప్పగానే ఆ సీన్ షూట్ చేశారని ఆమె చెప్పారు.