పిల్లిని పులిలా చేసి ఎంత కాలం చూసే వారిని మభ్యపెట్టవచ్చు.. అలాగే ఎన్నికల్లో నోట్లు, మందు బాటిళ్లతో గెలిచిన నాయకుల తీరు కూడా ఎంత కాలం దాచలేము.. ప్రస్తుతం మనుషుల వల్ల కానీ నాయకుల గుట్టును, అవినీతిని, ప్రకృతి తన భుజాల మీదికి ఎత్తుకుందట.. నిజమే కదా అనిపిస్తుమంది ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. ఎందుకంటే మహానగరం అని ఇనాళ్లూ మురిసిన హైదరాబాద్ ప్రస్తుతం అదరగొడుతుంది.. నాయకులు మాటలతో గొప్పగా తీర్చిదిద్దిన ఈ పట్టణం ఏరులా మారి అవినీతి నాయకుల రంగులు బయటపెడుతుంది..
ఇప్పటికైనా ఓటర్లు సిగ్గు తెచ్చుకుని పని చేసే నాయకున్ని ఎంచుకోకుంటే జస్ట్ ఇది షాంపిల్ మాత్రమే అంటా.. క్వాటర్ సీసాకు, మూడంకెల డబ్బులకు లొంగి మాయ చేసే మాయగాళ్లను గెలిపించి ఇప్పుడు నగరం మునిగిపోతుందని ప్రశ్నించే హక్కు ఓటర్‌కు లేదట.. ఎందుకంటే ఒక్క సారి డబ్బులు తీసుకుని ఐదేళ్ల భవిష్యత్తుని నాయకునికి అమ్ముకున్నాడు కదా అందుకట.. ఇకపోతే వరుణుడు కూడా మన తెలంగాణను పాలిస్తున్న గులాభి పార్టీలో చేరినట్టున్నాడు.. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధికి తన వంతు సాయంగా జలధారలు కురిపిస్తున్నాడట..
సిగ్గులేకుండా డబ్బులు తీసుకుని ఓట్లేసిన ప్రజలు జ్ఞానోదయం అయినట్లుగా హయత్ నగర్ కార్పొరేటర్ పై దాడికి పాల్పడడం కలకలం రేపింది. నాలాలకు సంబందించిన భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదంటూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీని కారణంగా..వరద నీరు ఇళ్లలోకి చేరిందని పేర్కొంటున్నారు. అర్రే ప్రజలకు తొందరగానే బుద్ధి వచ్చినట్లు ఉందని మురిసిపోవలసిన అవసరం లేదట.. ఎందుకంటే కుక్కతోక ఎప్పుడు వంకరే కదా.. దానికి ఎన్ని కిలోల బరువులు కట్టినా నిటారుగా నిలబడదు కదా..
ఇకపోతే నగరంలో వరుసగా వరుణుడు ఇస్తున్న షాకులకు సిటీ అంతా చిందరవందరగా మారింది.. ఈ నేపధ్యంలో అయ్యో పాపం ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఒక్క సారి చూద్దామని వచ్చిన అధికార పార్టీ నాయకులకు హారతులు ఇస్తున్నారట.. తెలంగాణ సాధించాక జరిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు.. దాన్ని చూడడానికి ఇన్నాళ్లూ పట్టిందని మురిసిపోతున్న యావత్ నగర ప్రజానికంలో ఏమూలో దాగున్న పౌరుషం పొడుచుకు రాగా హయత్ నగర్ కార్పొరేటర్ పై ఎగబడి ప్రజా సమస్యలు పట్టించు కోకుండా.. నిర్లక్షం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఇక మహిళలు కూడా దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఇతరులు ఆపే ప్రయత్నం చేసినా..స్థానికులు వినిపించుకోలేదు. కార్పొరేటర్ ను చుట్టుముట్టి చేయి వేసుకున్నారని సమాచారం.. మరి కబ్జాలను ప్రోత్సాహిస్తూ పబ్బం గడుపుకుంటున్న అధికారులు వానలు వస్తే నీరు ఎటుపోవాలో వరుణుడికి చెప్పకుంటే ఇట్టాగే చేస్తాడట.. మీ షోకులకు రహదారులు కావాలి.. మరి మా ప్రవహానికి ఏదారి లేకుండా చేసారు కదరా అంటూ మరో నాలుగు రోజులు కూడా నగర ప్రజలకు వరదల దెబ్బలు రుచి చూపించడానికి మళ్లీ సిద్దం అవుతున్నాడట.. ఇదండీ తెలంగాణా ప్రపంచ దేశాలు గర్వించే స్దాయిలో సాధించిన అభివృద్ధి..