అదేంటి రఘురామకృష్ణంరాజు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు.. ??

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు వేడి వేడిగా ఉంటాయి.. ఏదో ఒక వార్తతో ప్రజల్లో నానుతుంటాయని అనిపిస్తుంది.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇక ఎవరైనా పిలిచి పిల్లనిచ్చిన మామను దేవుడిలా భావిస్తారు.. కానీ ఏపీలో మాత్రం పిలిచి పదవిచ్చిన అధికార పార్టీని, వైఎస్ జగన్‌ను మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా టార్గెట్ చేస్తున్న వ్యక్తి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఇప్పటికే బద్ద శత్రువులా వైసీపీకి మారిపోతున్న ఈయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇదే కాకుండా ఏపీలో న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరోపిస్తూ, ఇది ధరిత్రి ఎరుగని చరిత్రగా అభివర్ణించారు. ఇక రాజ్యాంగం న్యాయమూర్తులకు ఎలాంటి ఉద్దేశ్యాలు ఆపాదించరాదని స్పష్టంగా చెప్తున్నా, వారిపై మాటల దాడులు ఆగడం లేదు. వరుసగా కోర్టులను దూషిస్తున్నారు.. ఇలా ఆరు నెలలుగా సోషల్ మీడియా దూషణాలపై ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.. కానీ ఎవరైనా తప్పుచేస్తున్న వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేస్తే మాత్రం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు..

ఇదీగాక చేతకాని, నిస్సహాయ స్దితిలో ఉన్న, సీబీసీఐడీ రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యానించారట. ఇక ఆనాడు మహాభారత కాలంలో కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగితే, అధికార పార్టీ హయామంలో ఈనాడు న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఇదివరకే చట్టాన్ని తన చేతులోకి తీసుకున్నారు, ఇప్పుడు న్యాయవ్యవస్దను కూడా తమ గ్రిప్ లోకి తీసుకోవాలన్న ప్రయత్నం ఏపీ లో జరుగుతుందన్నారు. ఇక ఈ విషయంలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్పందించాల్సి ఉంటుందని వివాదస్పదంగా మాట్లాడరట.. ఇలా మాట్లాడుతున్న ఈ ఎంపీ విషయంలో వైసీపీ అధిష్టానం ఇకనైన చర్యలు చేపడుతుందా లేదా అనేది తెలియడం లేదు..