రఘురామ సంచలనం: ఈసారి ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ మీదనే.!

Raghu Rama's Sensational Comments Against Army Hospital?

Raghu Rama's Sensational Comments Against Army Hospital?

మళ్ళీ మళ్ళీ అదే రచ్చ.. ఈసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆర్మీ ఆసుపత్రిని వివాదాల్లోకి లాగారు. ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి తన విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారంటూ రఘురామ ఏకంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కే ఫిర్యాదు చేయడం గమనార్హం. ఏపీ పోలీస్ ఉన్నతాధికారి అమ్మిరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డితో కలిసి కేపీ రెడ్డి.. తనపై కుట్రపూరితంగా వ్యవహరించారనీ, తాను అనారోగ్యంతో బాధపడుతున్నా, డిశ్చార్జి చేయించారని, వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలనీ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి రఘురామ ఫిర్యాదు చేశారు. మొత్తం 15 మంది ఏపీ పోలీసులు, ‘ఆర్మీ మెస్’లో ఈ కుట్రకు ప్లాన్ చేశారన్నది రఘురామ ఆరోపణ. అందుకు సంబంధించిన మెస్ బిల్లుల్ని కేంద్ర రక్షన మంత్రికి, తన ఫిర్యాదు లేఖతో జత చశారు నర్సాపురం ఎంపీ. ప్రస్తుతం రఘురామ ఢిల్లీలో వున్న విషయం విదితమే. నడవలేని పరిస్థితుల్లో వున్నా వీల్ ఛెయిర్ ఆధారంగా నిన్న రక్షన మంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్ళారు. ఆయనతో 30 నిమిషాలపాటు రఘురామ చర్చించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రఘరామ, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారట.

ఆ ఫిర్యాదు లేఖ బయటకు వచ్చింది. చిత్రమేంటంటే రఘురామ ఫిర్యాదులో పేర్కొన్న ముగ్గురు అధికారులూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ధర్మారెడ్డి, టీటీడీ జేఈఓ అయినా, రక్షణ శాఖతో సంబంధాలున్నాయి. తిరుపతి నుంచి ఈ నెల 18న డిప్యుటేషన్ మీద హైదరాబాద్ వచ్చారట ధర్మారెడ్డి. డిఫెన్స్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్ అధికారి అయన ధర్మారెడ్డి, తనకున్న పరిచయాల ఆధారంగా రఘురామ మీద కుట్ర పన్నారట. కొద్ది రోజులు ఆర్మీ ఆసుపత్రిలోనే తనకు చికిత్స అవసరమని రఘురామ ఎంతగా సూచించినా, కేపీ రెడ్డి చర్యల కారణంగా తాను ముందే డిశ్చార్జి అవ్వాల్సి వచ్చిందని రఘురామ ఆరోపిస్తున్నారు. నిజానికి, ఆర్మీ ఆసుపత్రి మీద ఆరోపణలు చేయడమంటే రఘురామ చాలా పెద్ద రిస్క్ చేసేసినట్లే. ఇక్కడ కూడా సామాజిక వర్గ కోణాన్ని చూస్తున్న రఘురామని ఎలా అర్థం చేసుకోవాలో ఏమో.