Health Tips: మన భారతీయ వంటల్లో ఏ వంటకం తయారు చేయాలన్న కచ్చితంగా పోపులో ఆవాలు ఉపయోగిస్తాం. ఆవాలు మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా నలుపు రంగులో ఉన్న ఆవాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో పసుపు రంగులో ఉన్న ఆవాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ పసుపు రంగు ఆవాలలో విటమిన్స్, ప్రోటీన్స్, బి కాంప్లెక్స్ విటమిన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.మహిళల్లో సంభవించే గర్భాశయ క్యాన్సర్ను నిరోధించటంలో ఈ పసుపు రంగు అవాలు ఎంతో ఉపయోగపడతాయి.
ప్రస్తుతకాలంలో అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలు క్యాన్సర్ సమస్య కూడా ప్రధానమైనదిగా భావించవచ్చు. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ముఖ్యంగా స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్ నిరోధించటంలో పసుపు రంగు ఆవాలు ఎలా ఉపయోగపడతాయి ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భాశయ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్ తో బాధపడేవారు ప్రతి రోజు వారు తీసుకొని ఆహారంలో పసుపు రంగు ఆవాల నుండి తీసిన నూనె లేదా ఆవాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పసుపు ఆవాలలో గ్లూకోసినోలైట్స్ అనే కెమికల్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ సమస్యను నియంత్రిస్తుంది. ఈ పసుపు ఆవాలు క్యాన్సర్ నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఈ ఆవాలు చేర్చటం వల్ల క్యాన్సర్ సమస్యను నిరోధించడమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆవాలలో మెగ్నీషియం, ప్రోటీన్స్ , కార్బోహైడ్రేట్ వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం శరీరంలో జీవక్రియ రేటును పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయి.అంతేకాకుండా నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఈ ఆవాల నూనె ను నోట్లో వేసుకొని ఒక నిమిషం తరువాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.