Roja: సినీనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజ అనంతరం రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో ఎంతో బిజీగా గడిపారు. నగరి నియోజకవర్గము నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత కూడా రోజా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ వచ్చారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ రోజా ప్రేక్షకులను సందడి చేశారు.
ఇక ఈమె 2019లో కూడా ఎమ్మెల్యేగా నగరి నుంచి విజయం సాధించిన తర్వాత కూడా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగారు కానీ ఈమెకు మంత్రిగా బాధ్యతలు ఇవ్వడంతో జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. ఇక ప్రస్తుతం వైఎస్సార్సీపి పార్టీ ఓటమిపాలు కావడంతో రోజా తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇక రోజా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగుతున్న సమయంలో ఎంతోమంది కమెడియన్లకు ఈమె సహాయం చేసినట్లు స్వయంగా జబర్దస్త్ కమెడియన్స్ బయట పెట్టారు.
కొంతమంది రోజా నుంచి సహాయం అందుకొని ఆమెపై విమర్శలు చేయడాన్ని కూడా కొంతమంది కమెడియన్లు తప్పుపట్టారు. అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ మాత్రం రోజా కాళ్ళపై పడి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఓ బుల్లి తెర కార్యక్రమంలో రోజా జడ్జిగా పాల్గొని సందడి చేస్తున్నారు. అయితే రోజా గారితో మాట్లాడటం కోసమే ఈ వేదిక పైకి పంచ్ ప్రసాద్ వచ్చినట్లు తెలిపారు.
గతంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయంతో ఉండేవారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. దీంతో ఆయనకు కిడ్నీ మార్పిడి కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది ఆ సమయంలో ఎవరు సాయం చేయడానికి ముందుకు రాలేదు దీంతో రోజా గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఈ విషయం గురించి మాట్లాడి ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కు అయ్యే డబ్బును ఏర్పాటు చేశారు.
ఇలా ఆపరేషన్ సక్సెస్ కావడంతో పంచ్ ప్రసాద్ ఇప్పుడు చాలా సంతోషంగా భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అలాగే తిరిగి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇలా తనకు పునర్జన్మ నిచ్చిన రోజా గారికి ధన్యవాదాలు తెలపడం కోసం ఈయన వేదిక పైకి వచ్చారు. నాకు మా అమ్మ జన్మనిస్తే రోజా గారు పునర్జన్మని ఇచ్చారు మీరు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిది తిరిగి మీ రుణం తీర్చుకోలేనిది అంటూ వేదిక పైనే ఆమె కాళ్ళపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.