ఎక్కడికక్కడ టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాలకు బ్రేక్.. వరద సాయం ఏది అంటూ నిరసనలు?

protests against trs in ghmc elections campaign

ప్చ్.. హైదరాబాద్ లో వచ్చిన భారీ వరదలు టీఆర్ఎస్ పార్టీ కొంప ముంచేలా ఉన్నాయి. సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికలకు నెల రోజుల ముందే హైదరాబాద్ లో భారీ వర్షాలు రావడం.. ఎన్నడూ లేనంతగా భారీ వరదలు ముంచెత్తడంతో నగరమంతా మునిగిపోయింది. అది టీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది. ఆరేళ్ల నుంచి అధికారంలో ఉండి.. 67 వేల కోట్లు పెట్టి హైదరాబాద్ ను బాగు చేశాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ.. వరదలు వస్తే మాత్రం హైదరాబాద్ మునిగిపోతుంది.. ఇదేనా అభివృద్ధి అంటే అంటూ.. ప్రతిపక్షాలు గొంతెత్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఈ అంశాన్ని క్యాష్ చేసుకొని ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను తమవైపునకు తిప్పుకుంటున్నాయి.

protests against trs in ghmc elections campaign
protests against trs in ghmc elections campaign

నిజానికి.. టీఆర్ఎస్ కూడా హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించింది. సుమారు ఆరున్నర లక్షల మంది వరద బాధితులకు సాయం అందించింది. 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేసింది. ఇంకా.. ఎవరైనా ఉంటే మీసేవ ద్వారా అప్లయి చేసుకుంటే వరద సాయం అందిస్తామని తెలిపింది. కానీ.. ఇంతలోనే గ్రేటర్ ఎన్నికలు రావడంతో దానికి పుల్ స్టాప్ పడింది.

అయితే.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి వరద సాయం విషయమై అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారం చేయకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. నిరసన తెలుపుతున్నారు. వరద సాయం ఏది? అంటూ నిలదీస్తున్నారు. బీజేపీ కావాలని ఆపించిందని.. ఎన్నికలు పూర్తికాగానే మళ్లీ వరద సాయం అందుతుందని స్పష్టంగా టీఆర్ఎస్ అభ్యర్థులు చెబుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం వినడం లేదు. వాళ్లకు బీజేపీ వాళ్లు కూడా తోడై టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

హిమాయత్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి హేమలత యాదవ్ ను బస్తీ వాసులు అడ్డుకున్నారు. తనను ప్రచారం చేయకుండా నిరసన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దానం నాగేందర్, మంత్రి గంగులను స్థానికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కూడా నిరసన సెగ తగిలింది.

అల్వాల్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ జితేందర్ ను కూడా స్థానికులు అడ్డుకున్నారు. యాప్రాల్ లోనూ మైనంపల్లి హన్మంతరావును స్థానికులు అడ్డుకున్నారు. ఇలా.. ప్రతిచోట ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానికులు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారం చేయకుండా అడ్డగిస్తున్నారు. వాళ్లకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు మద్దతు పలుకుతున్నారు. దీంతో ఎలా ప్రచారం చేయాలి అంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.